వరిధాన్యం కొనుగోలు ప్రక్రియ సమర్థవంతంగా నిర్వహించాలి జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్

 

ప్రజాబలం లక్షెట్టిపేట మండల రిపోర్టర్ నవంబర్ 22 : ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి కనీస మద్దతు ధరతో రైతుల నుండి ధాన్యం కొనుగోలు చేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు.శుక్రవారం జిల్లాలోని లక్షెట్టిపేట మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆకస్మికంగా సందర్శించి ప్రక్రియను పరిశీలించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ…ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల ద్వారా రైతుల నుండి ధాన్యం కొనుగోలు చేసి మద్దతు ధర చెల్లిస్తుందని,సన్నరకం వడ్లకు మద్దతు ధరతో పాటు అదనంగా 500 రూపాయల బోనస్ ఇవ్వడం జరుగుతుందని, సన్నరకం ధాన్యాన్ని వ్యవసాయ విస్తరణాధికారులు గుర్తించి ధృవపత్రం జారీ చేయాలని, సన్నరకం,దొడ్డురకం వడ్లను వేర్వేరుగా కొనుగోలు చేయాలని,తెలిపారు. క్వింటాల్ ఏ గ్రేడ్ రకానికి 2 వేల 320 రూపాయలు, సాధారణ రకానికి 2 వేల 300 రూపాయలు చెల్లించడం జరుగుతుందని తెలిపారు. రైతులు ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చే సమయంలో 17 శాతం కంటే తక్కువగా తేమ శాతం ఉండాలని, తాలు,మట్టిగడ్డలు లేకుండా నిబంధనలను పాటిస్తూ నాణ్యమైన ధాన్యాన్ని తీసుకురావాలని,కొనుగోలు కేంద్రాలలో రైతుల సౌకర్యార్థం మౌళిక వసతులు కల్పించడం జరిగిందని తెలిపారు.వరి పంట పూర్తి కోత దశకు వచ్చిన తరువాత హార్వెస్టర్ యంత్రంలో నిర్దిష్ట ఫ్యాన్ వేగంతో పంట కోయాలని తెలిపారు.కొనుగోలు కేంద్రాలలో తూకం,తేమ యంత్రాలు,త్రాగునీరు, నీడ,గన్ని సంచులు, టార్పాలిన్లు అందుబాటులో ఉంచాలని,కొనుగోలు కేంద్రాల నిర్వాహకులకు నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని,కొనుగోలు సమయంలో సంబంధిత రైతులకు రశీదు జారీ చేయాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, కొనుగోలు కేంద్రం నిర్వాహకులు,రైతులు ఆకుల శంకరయ్య,మల్లేష్, వెంకటస్వామి,పెద్ద మల్లేష్ రైతులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking