ఆందోల్ నియోజకవర్గం ప్రతినిధి మే 5 (ప్రజాబలం ) సంగారెడ్డి జిల్లా అందోల్ నియోజకవర్గం పరిధిలోని అల్లాదుర్గం మండలం వివిధ గ్రామాలకు చెందిన 28 మంది కల్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను ఈరోజు సోమవారం మండల కేంద్రంలోని రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ఆదేశానుసారం అల్లాదుర్గ్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కొప్పుల శేషరెడ్డి అధ్యక్షతన కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను, తహసిల్దార్ మల్లయ్య, వట్టిపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీమతి కొప్పుల లక్ష్మీ శేషారెడ్డి, కలిసి లబ్ధిదారులకు షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి, చెక్కులను లబ్ధిదారులకు అందజేయడం జరిగింది, ఈ కార్యక్రమంలో నాయకులు శ్రీనివాస్ రెడ్డి, అందోల్ యూత్ మాజీ అధ్యక్షుడు శశి రెడ్డి, మండల యువజన పార్టీ అధ్యక్షుడు కురుమ మహేష్, కిసాన్ సెల్ మండల అధ్యక్షుడు బేతాయ, సోషల్ మీడియా కోఆర్డినేటర్ జైపాల్, ఎస్టి సెల్ మండల అధ్యక్షుడు బాల్య నాయక్, మాజీ సర్పంచ్ అంజు గౌడ్, పార్టీ కార్యకర్తలు లబ్ధిదారులు పాల్గొన్నారు…