జోగిపేట నర్సింగ్ కాలేజీకి నూతన బస్సు

👉 అందజేసిన మంత్రి దామోదర్ రాజనర్సిం

ఆందోల్ నియోజకవర్గం ప్రతినిధి మే 5 (ప్రజాబలం ) సంగారెడ్డి జిల్లా సోమవారం జిల్లా కలెక్టరేట్ లో( సి ఎస్ ఆర్) నిధులనుంచి (తోషిబా) కంపెనీ ద్వారా ప్రభుత్వ కళాశాల ఆందోల్ జోగిపేటకు నూతన బస్సును జిల్లా కలెక్టర్, క్రాంతి వల్లూరు,తో జెండా ఊపి మంత్రి దామోదర్ రాజనర్సింహ, ప్రారంభించారు, బస్సులో విద్యార్థులతో, మంత్రి దామోదర్ రాజనర్సింహ, జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు, కలిసి ప్రయాణించారు, ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, సమాజంలో మార్పు రావాలంటే సమాజం ఉన్నతంగా తీర్చిదిద్దాలంటే సమాజంలో ఉన్న అనేక రుగ్మతలను రూపుమాపాలంటే బాలికలు అత్యంత విద్యావంతులై ఉండాలన్నారు, బాలికలు విద్యావంతులైతేనే సమాజంలో మార్పు వస్తుందన్నారు, నూతన బస్సును ప్రారంభించినందుకు విద్యార్థినిలు, దామోదర్ రాజనర్సింహకు ప్రత్యేక అభినందనలు శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, (తోషిబా) కంపెనీ ప్రతినిధులు, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు….

Leave A Reply

Your email address will not be published.

Breaking