సనత్ నగర్ ( ప్రజాబలం ప్రతినిధి నరేష్) మే 5 ఆడబిడ్డ పెండ్లి కి ఆర్ధిక సహాయం అందించిన మొట్టమొదటి రాష్ట్రం తెలంగాణ అని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సోమవారం వెస్ట్ మారేడ్ పల్లి లోని ఎమ్మెల్యే కార్యాలయంలో 38 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి 13, షాదీముబారక్ 25 ల క్రింద మంజూరైన ఆర్ధిక సహాయం చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆడబిడ్డ పెండ్లి చేయడం కోసం పేద, మధ్య తరగతి కుటుంబాలు ఆర్ధికంగా పడుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని అప్పటి ముఖ్యమంత్రి కెసిఆర్ ఒక లక్ష 116 రూపాయలు చొప్పున ఆర్ధిక సహాయం అందించే ఈ కార్యక్రమంకు శ్రీకారం చుట్టారని తెలిపారు. అర్హులైన వారు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ లు కొలన్ లక్ష్మి, టి.మహేశ్వరి, కుర్మ హేమలత, మాజీ కార్పొరేటర్ లు నామన శేషుకుమారి, అత్తిలి మల్లిఖార్జున్ గౌడ్, డివిజన్ బి ఆర్ ఎస్ అధ్యక్షులు కొలన్ బాల్ రెడ్డి, అత్తిలి శ్రీనివాస్ గౌడ్, శ్రీనివాస్ గౌడ్, వెంకటేషన్ రాజు, బాల నగర్, సికింద్రాబాద్ తహసీల్దార్ కార్యాలయాల సిబ్బంది, పలువురు నాయకులు పాల్గొన్నారు.
