ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వైస్ చైర్మన్ బొప్పు సతీష్
ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి మార్చి 15 : మంచిర్యాల జిల్లాలోని లక్షెట్టిపేట పట్టణంలోని ప్రభుత్వ ఉన్నంత పాఠశాలలోని పదవ తరగతి చదువుతున్న విద్యార్థులకు పాడ్స్,పెన్నులు పంపిణీ చేసిన ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వైస్ చైర్మన్ బొప్పు సతీష్ పంపిణీ చేయడం జరిగింది.శుక్రవారం ఈ సందర్భంగా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వైస్ చైర్మన్ మాట్లాడుతూ…లక్షెట్టిపేట లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 10 వ తరగతి చదువుతున్న విద్యార్థులకు రాబోయే పరీక్షల దృష్ట్యా విద్యార్థులకు,ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ద్వారా విద్యార్థిని విద్యార్థులకు పాడ్స్,పెన్నులు పంపిణీ చేయడం జరిగింది అని తెలిపారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు,విద్యార్థులు, సొసైటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.