అభివృద్ధి కోసం సర్కార్ కృషి

లక్షెట్టిపేట ఎంపీపీ అన్నం మంగ

సీసీ రోడ్డు పనులు ప్రారంభం

ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి మార్చి 15 : అభివృద్ధి కోసం కాంగ్రెస్ సర్కార్ నిరంతరం కృషి చేస్తుందని లక్షెట్టిపేట ఎంపీపీ అన్నం మంగ పేర్కొన్నారు. శుక్రవారం మండలంలోని చందారం గ్రామంలో న్యూ ఎస్సీ కాలనీలో గోగర్ల భీమయ్య ఇంటి నుండి మామిడి రాజు ఇంటి వరకు సిమెంటు రోడ్డు పనులను ఆమె కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు.ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ… మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు ను రోడ్డు అవసరం ఉందని అడగగానే మంజూరు చేసినందుకు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. అన్నం చిన్నన్న,చందారం గ్రామపంచాయతీ సెక్రటరీ, పులగం గంగాధర్, అన్నం శ్రీనివాస్,ఉత్తమ్,అరుకుట రామయ్య,బొడ్డు రాయమల్లు, సారం భగవంతం,పులగం తిరుపతి,బండి బాపు,గోగర్ల పోచయ్య,ఆకుల వెంకటేశు, గోగర్ల రాజయ్య,చందారం మహిళలు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking