సూరారంలో ప్రొసీడింగ్స్ పంపిణీ

 

హామీలను అమలు చేస్తున్నాం

కాంగ్రెస్ నాయకుడు అన్నవేణి భాను

ప్రజాబలం లక్షెట్టిపేట మండల రిపోర్టర్ అక్టోబర్ 04 : రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న 6 గ్యారంటీలను అమలు చేస్తున్నామని కాంగ్రెస్ నాయకులు అన్నవేణి భాను పేర్కొన్నారు. శుక్రవారం మండలంలోని సూరారం గ్రామపంచాయతీలో ఆరు గ్యారంటీల్లో భాగంగా గృహ జ్యోతి పథకం కింద 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ సంబంధించిన ప్రొసీడింగ్స్ సూరారంలో అందజేశారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ… కాంగ్రెస్ ప్రభుత్వం పేద ప్రజలకు అండగా ఉందన్నారు. అక్టోబర్ మొదటి వారంలో అందరికీ కొత్త రేషన్ కార్డులు, హెల్త్ కార్డులు ఇవ్వడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో నాగరెడ్డి మల్లారెడ్డి, నాగిరెడ్డి రవి, చెల్ల శ్రీనివాస్,ఎండి రహీం,జల్లిల్,ఇబ్రహీం, కాజా మియ గ్రామ ప్రజలు,గ్రామ సెక్రెటరీ వీనతి,కారోబారి బండి మల్లేష్,సిబ్బంది పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking