మూడుచింతలపల్లి తహాసీల్దారు కార్యాలయం నిర్మాణ పనుల పరిశీలన మేడ్చెల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ గౌతం

 

నూతనంగా నిర్మిస్తున్న మూడుచింతలపల్లి తహాసీల్దారు కార్యాలయంలో రికార్డులను సరైన విధంగా భద్రపరిచేలా స్టాంగ్ర్ రూమ్ లను ఆధునీకురణ పద్దతులతో నూతన భవనాన్ని నిర్మించి, నిర్మాణం ఒక ఉదాహరణగా ఉండేలా చూడాలని మేడ్చెల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ గౌతం తహాసీల్దారు వెంకట నర్సింహారెడ్డికి సూచించారు.
శుక్రవారం మూడుచింతలపల్లిలో నిర్మిస్తున్న తహాసీల్దారు కార్యాలయాన్ని తనిఖీ చేసి నిర్మాణ పనులను జిల్లా అదనపు కలెక్టరు రాధికా గుప్తాతో కలిసి కలెక్టర్ గౌతం పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టరు మాట్లాడుతూ అద్దెభవనంలో ఉంటున్న తహాసీల్లారు కార్యాలయానికి సొంత భవన నిర్మాణ పనులను పర్యవేక్షిస్తూ, కార్యాలయ నిర్మాణంలో రికార్డులను సరైన విధంగా భద్రపరిచేలా స్టాంగ్ర్ రూమ్ లను ఆధునీకురణ పద్దతులతో నిర్మించాలని అన్నారు. కంప్యూటర్ రూములు, సిబ్బందికి, కార్యాలయానికి వచ్చే ప్రజలకు సౌకర్యవంతంగా ఉండేలా నిర్మాణ పనులు చేపట్టాలని సూచించారు. ఇంకా ఎన్నిరోజులలో నిర్మాణం పూర్తవుతుందని, ఇప్పటి వరకు ఎంత ఖర్చు ఐందని, ఇంకా ఎంత ఖర్చు అవుతుందని కలెక్టరు అడిగి తెలుసుకున్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking