సేవా సమితి ఆధ్వర్యంలో రంజాన్ తోఫా పంపిణీ

 

ప్రజాబలం మంచిర్యాల నియోజకవర్గం రిపోర్టర్ మార్చి 21 : మంచిర్యాల జిల్లాలోని లక్షెట్టిపేట మున్సిపాలిటీ పరిధిలోని శ్రీ శివ సాయి గణేష్ సేవా సమితి ఆధ్వర్యంలో రంజాన్ సందర్భంగా నిరుపేద ముస్లింలకు 15 మంది కుటుంబాలకు 22,500 రూపాయల విలువ ఒక్కొక్కరికి 1500 రూపాయల(రంజాన్ తోఫా)కిరాణం నిత్యవసర సరుకులను శుక్రవారం రోజున అందజేయడం జరిగినది.ఈ కార్యక్రమం సమితి అధ్యక్షుడు పాటిబండ్ల ప్రసన్న శ్రీరామ మూర్తి ఆధ్వర్యంలో జరిగినది.శుక్రవారం ఈ కార్యక్రమంలో పాల్గొన్న సమితి సభ్యులు నార్ల సుమతమ్మ, నరేందుల భీమన్న,నరేందుల ప్రభాకర్,తాటికొండ శ్రీనివాస్,నల్మాస్ ధనలక్ష్మి శ్రీనివాస్ జైన శ్రీనివాస్, కొంజర్ల ప్రసాద్,మైనార్టీ సభ్యులు గఫూర్ తదితరులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.

Breaking