కారుణ్య నియామక పత్రాలు అందజేసిన జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ

 

రాజన్న సిరిసిల్ల జిల్లా, మార్చి 21:
(ప్రజా బలం ప్రతినిధి)

సిరిసిల్ల మున్సిపాలిటీలో ప్రజారోగ్య విభాగంలో పని చేసి మరణించిన వారి వారసులకు జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా శుక్రవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో కారుణ్య నియామక పత్రాలు అందజేశారు.

ప్రజారోగ్య విభాగంలో పబ్లిక్ హెల్త్ వర్కర్ గా విధులు నిర్వర్తించిన సిరిగిరి నర్సింహులు అనే ఉద్యోగి అనారోగ్య కారణాలతో 2020 సంవత్సరంలో మరణించగా, వారి కుమారుడు సిరిగిరి రాజుకు ఉద్యోగ నియామక పత్రం అందజేశారు. అలాగే అదే విభాగంలో పబ్లిక్ హెల్త్ వర్కర్ గా విధులు నిర్వర్తించిన నగునూరి నాంపల్లి అనారోగ్య కారణాలతో 2023 సంవత్సరంలో మరణించగా అతని భార్య నగునూరి లత కు ఉద్యోగ నియామక పత్రం కలెక్టర్ అందజేశారు. గత కొన్ని సంవత్సరాలుగా పెండింగ్ లో ఉండగా, ఈరోజు నియామక పత్రాలను అందజేసినందుకు ఈ సందర్భంగా వారు జిల్లా కలెక్టర్ కు ధన్యవాదాలు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking