హుజురాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం ప్రజాబలం ప్రతినిధి మార్చి 21
జమ్మికుంటలో ప్రారంభమైన పదవ తరగతి పరీక్షలు విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్టు జమ్మికుంట మండల విద్యాధికారి హేమలత టౌన్ సిఐ వరగంటి రవి తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జమ్మికుంట మండల వ్యాప్తంగా ఆరు పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు మండల విద్యాధికారి తెలిపారు. ఆరు సెంటర్లలో మొత్తం విద్యార్థులు 1048 మంది పరీక్షలు రాస్తున్నట్లు 6 సెంటర్ లలో 70 మంది ఇన్విజిలేటర్ లను ఏర్పాటు చేసి పరీక్ష కేంద్రాలను కేంద్రాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తున్నట్లు తెలిపారు. జమ్మికుంట టౌన్ సిఐ వరగంటి రవి, మాట్లాడుతూ విద్యార్థులకు ఏలాంటి ఇబ్బందులకు లేకుండా అన్ని పరీక్ష కేంద్రాల్లో ఏర్పాటులు చేసి బందోబస్తు చేసినట్లు తెలిపారు. పరీక్ష కేంద్రాలలో విద్యార్థులకు పరీక్ష గదులలో, ఫ్యాన్ లు మంచినీటి వసతులను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.