ప్రజాబలం ప్రతినిధి మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మార్చి 21:
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో రాష్ట్ర ఫుడ్ సేఫ్టీ టాస్క్ ఫోర్స్ అధికారుల ఆకస్మిక తనిఖీలు, పసుపు కారం మరియు మసాలాల తయారీ కేంద్రాలు మరియు నిల్వ, విక్రయ కేంద్రాలపై, మరియు పలు రెస్టారెంట్లపై దాడులు.
తెలంగాణ రాష్ట్ర ఫుడ్ సేఫ్టీ కమిషనర్ ఆర్.వి కర్ణన్ ఆదేశాల ప్రకారం తెలంగాణ రాష్ట్ర ఫుడ్ సేఫ్టీ టాస్క్ ఫోర్స్ టీం హెడ్, జోనల్ అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ వి.జ్యోతిర్మయి ఆధ్వర్యంలో టాస్క్ ఫోర్స్ ఫుడ్ ఇన్స్పెక్టర్స్. రోహిత్, శ్రీషిక,పి.స్వాతి, జగన్నాథ్ లతో కూడిన బృందం మేడ్చల్ జిల్లా నందు గల కిష్టాపూర్ షామీర్ పేట్, సర్వే నెంబర్ 819 , హైదరాబాద్ ఫుడ్ ప్రొడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ( సూర్య మసాలా మరియు స్పైసెస్), లో ఆకస్మిక తనిఖీలు జరపగా,తనిఖీల్లో బయటపడ్డ ముఖ్యమైన ఉల్లంఘనలు
హైదరాబాద్ ఫుడ్ ప్రొడక్ట్స్ (సూర్య మసాలా & స్పైసెస్), ఐడీఏ మేడ్చల్, మల్కాజ్‌గిరి జిల్లా తనిఖీ లో సంబంధిత రాష్ట్ర టాస్క్ ఫోర్స్ అధికారుల బృందం హైదరాబాద్ ఫుడ్ ప్రొడక్ట్స్ (సూర్య మసాలా & స్పైసెస్) పరిశ్రమను తనిఖీ చేసింది. ఈ తనిఖీలో పలు ఆహార పరిరక్షణ ఉల్లంఘనలు గుర్తించబడ్డాయి.
శుభ్రత మరియు పారిశుద్ధ్యం లోపం – మసాలాలు మరియు
లేబుల్ లోపాలు – మసాలా ఉత్పత్తిలో ఉపయోగిస్తున్న ముడి పదార్థాలపై తగిన లేబుల్ సమాచారం లేకపోవడం,పెచ్చులు
ఉడిపోయిన గోడలు మరియు దుమ్ము ధూళితో మురికిగా పాడై ఉండటం, అపరిశుభ్రమైన పరిసరాలు & కలుషిత వాతావరణం,
తయారైన ఆహార పదార్థాల నిల్వ – పికిల్స్, అల్లం-వెల్లుల్లి పేస్ట్ వంటి పదార్థాలు పూర్తిగా శుభ్రత లేని ఫంగస్ తో కూడిన ప్లాస్టిక్ కంటైనర్లలో నిల్వ,
కీటకాల ప్రభావిత పదార్థాలు.
ఈ తనిఖీల్లో 46.75 క్వింటాళ్ల తయారైన సెమి ఆహార పదార్థాలు (పికిల్స్, అల్లం-వెల్లుల్లి పేస్ట్) మరియు మసాలా పొడులు కలిగి ఉన్న రూ. 3 లక్షల 3 వేల విలువైన నిల్వను సీజ్ చేసి, లోపభూయిష్టమైన నమూనాలను ల్యాబ్‌కి పంపించగా, మురికిగా ఉన్న కంటైనర్లు, ఫంగస్ పెరిగిన పదార్థాలు, వాడుక తేదీలు లేకపోవడం, అధిక దుర్వాసన కారణంగా కొన్ని ఉత్పత్తులను ధ్వంసం (డిస్కార్డ్) చేయడం జరిగింది.
అపరిశుభ్రత వాతావరణం లో తుప్పు పట్టిన మిషనరీ ఉపయోగించి పలు ఆహార పదార్థాలు తయారీని జరుగుతున్నట్లు గుర్తించడం జరిగింది.
సంబంధిత సంస్థకు తగిన నోటీసులు జారీ చేయబడ్డాయి. అనుమానిత ఆహారపదార్థాలను పరీక్షల నిమిత్తం శాంపిల్స్ సేకరించి ల్యాబ్ కు తరలించడం జరుగుతుందని తెలిపారు.నివేదికలో కల్తీ అని నిర్ధారణ అయితే వారిపై చట్టరీత్యా కఠిన చర్యలు ఉంటాయని టాస్క్ ఫోర్స్ ఫుడ్ సేఫ్టీ అధికారులు హెచ్చరించారు.
ప్రజలకు ఆరోగ్యకరమైన ఆహారం అందించాలనే లక్ష్యంతో, ఆహార భద్రతా నిబంధనలను ఖచ్చితంగా అమలు చేయాలని హెచ్చరించడం జరిగింది. మరియు అపరిశుభ్ర ప్రాంతంలో మూతలు తీసిన దుమ్ము ధూళి ఈగలతో కూడిన వండిన ఆహార పదార్థాలను మరియు అధికంగా పలుమార్లు వేడి చేసిన వంట నూనెను ఆహార పదార్థాలలో వాడుతుండడం గమనించి ,ఆగ్రహం వ్యక్తం చేసిన అధికారులు పలు ఎఫ్ ఎస్ ఎస్ ఏ సెక్షన్ల కింద నోటీసులు జారీ చేయడం జరిగింది.ఈ సందర్భంగా వ్యాపారాలలో అవకతవకలకు పాల్పడే సదరు వ్యాపారుల మీద తెలంగాణ రాష్ట్ర ఆహార భద్రతా టాస్క్ ఫోర్స్ అధికారులు ఆహార నాణ్యత, మరియు ఆహార పరిరక్షణ మీద తీవ్ర హెచ్చరికలు చేశారు.
ఈ పరిస్థితుల్లో ఆహార పదార్థాలు తయారుచేసి, నిలువ చేసి రవాణా చేసి,విక్రయించే వ్యాపారులు ప్రజలకు సురక్షిత ఆహారం అందించేందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పలు నోటీసులు,సూచనలు జారీ చేశారు.
ప్రజల ఆరోగ్య రక్షణ కోసం తెలంగాణ ఫుడ్ సేఫ్టీ టాస్క్ ఫోర్స్ కఠిన చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉంది.నిబంధనలు పాటించని, అనుమతులులేకుండా కార్యకలాపాలు నిర్వహిస్తున్న వ్యాపారాలపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని, అవసరమైతే సీజ్ చేస్తామని రాష్ట్ర టాస్క్ ఫోర్స్ టీం హెడ్ వి.జ్యోతిర్మయి తేల్చిచెప్పారు. వ్యాపారులు నిబంధనలు పాటిస్తూ బాధ్యతతో వ్యవహరించాలని రాష్ట్ర ఫుడ్ సేఫ్టీ టాస్క్ ఫోర్స్ టీం హెడ్ అయిన వి. జ్యోతిర్మయి మరియు టాస్క్ ఫోర్స్ అధికారులు సూచించడం జరిగింది.