వైయస్సార్ టిపి పార్టీ ఆధ్వర్యంలో రంజాన్ పర్వదినం సందర్భంగా నిరుపేద ముస్లింలకు రంజాన్ తోఫా కిట్లను పంపిణీ
ఖమ్మం ప్రతినిధి ఏప్రిల్ 21 (ప్రజాబలం) ఖమ్మం కార్పొరేషన్ ఖానాపురం వైయస్సార్ టిపి పార్టీ కార్యాలయంలో రంజాన్ పర్వదినం సందర్భంగా వైయస్సార్ టిపి పార్టీ అసెంబ్లీ ఇన్చార్జి తుంపాల కృష్ణమోహన్ ఆధ్వర్యంలో నిరుపేద ముస్లింలకు రంజాన్ కిట్లను పంపిణీ చేశారు . ఈ పవిత్రమైన రంజాన్ ను ముస్లిం సోదర సోదరీమణులు అందరూ సంతోషంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు . వైయస్సార్ టిపి పార్టీ అధినేత షర్మిలమ్మ అధికారంలోకి వస్తే బడుగు , బలహీన వర్గాల ప్రజలందరికీ న్యాయం జరిగిందని అన్నారు. ఈ సందర్బంగా YSR తెలంగాణ పార్టీ ఖమ్మం అసెంబ్లీ ఇంఛార్జి తుంఈ సందర్బంగా YSR తెలంగాణ పార్టీ ఖమ్మం అసెంబ్లీ ఇంఛార్జి తుంపాల కృష్ణమోహన్ మాట్లాడుతూ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ముస్లిం ల అభ్యున్నతి కోసం ఎంతగానో కృషి చేశారు ముస్లిం లకు 4% రిజర్వేషన్ కల్పించి ఉన్నత విద్యా లో అలాగే ఉద్యోగాల్లో సముచితపాల ముస్లింలకు కొన్ని ప్రత్యేక ప్రభుత్వ పథకాలను తీసుకురావడం జరిగిందని గుర్తు చేశారు . ఎంతోమంది ప్రజల జీవితాలలో వెలుగులు నింపిన మహనీయుడు అని కొనియాడారు . షర్మిలమ్మ తోనే రాజ్యధికారం వస్తుందని , మీ యొక్క సహాయ , సహకారాలు మరియు ఆశీస్సులు ఎల్లవేళలా షర్మిలమ్మ కు ఉండాలని , మీ అభిమానం ఉన్నంతవరకు ప్రజల సమస్యలపై పోరాడుతుందని అన్నారు . ఈ సందర్భంగా వచ్చిన ముస్లింలు వైయస్సార్ టిపి పార్టీ ఆధ్వర్యంలో ఇలాంటి పలు సేవా కార్యక్రమాలను చేయడం పట్ల హర్షం వ్యక్తం వేశారు . ఈ రంజాన్ పండుగ మి అందరికీ అల్లా సుఖశాంతులు ఆయుర్ ఆరోగ్యాలు ఇవ్వాలని భగవంతుడిని వేడుకున్నారు ఈ కార్యక్రమం లో ఖమ్మం అసెంబ్లీ బూత్ కన్వీనర్ మర్రి శ్రీనివాస, నగర ప్రధాన కార్యదర్శి ఎస్ వి సత్యనారాయణ నాయకురాలు వనపర్ల అరుణ, ఇంకా పెద్దయెత్తున మహిళలు తరలివచ్చారు