మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ప్రజాబలం ప్రతినిధి 21ఏప్రిల్ 2023: పవిత్ర రంజాన్ మాసం ముగిసిన శుభవేళ ముస్లిం సోదరులకు జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్ ఈద్ ఉల్ ఫితర్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.
రంజాన్ పండగ సందర్భంగా జిల్లాలోని ముస్లిం సోదరులందరికీ శుభాకాంక్షలు తెలిపిన జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ముస్లిములు అందరు రంజాన్ మాసాన్ని అత్యంత పవిత్రమైన మాసంగా పరిగణిస్తారు రంజాన్ మాస పవిత్రతతో ప్రతి వ్యక్తి మానసిక పరివర్తన చెంది ప్రేమమూర్తిగా మార్పు చెందుతారని, ఈ మాసంలో ఆధ్యాత్మిక ఆరాధనతో అనుబంధం మరింత బలపడుతుందని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు .సర్వ మానవాళి సమానత్వాన్ని చాటుతూ, దాతృత్వాన్ని అలవరచే రంజాన్ పండుగ వేళ ఇస్లాంను గౌరవించే ప్రతి ఒక్కరి కుటుంబంలో ఆనందం వెల్లి విరియాలని అన్నారు