ఆకర్షనీయంగా చేపల ప్రదర్శన కేంద్రం : తూర్పు ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్.

 

వరంగల్ ప్రజాబలం ప్రతినిధి ఏప్రిల్ 20:
ఎంతో ఆకర్షణీయంగా అందరినీ ఆకట్టుకునే విధంగా ఫిష్ టన్నెల్ కేంద్రం ఉన్నదని వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ అన్నారు. వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని ఎంజీఎం ఎదురుగా ఉన్న ఇస్లామీయ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన ఎస్ ఎస్ అండర్ వాటర్ ఫిష్ టన్నెల్ ఎక్స్ప్ లో రకరకాల చేపల ప్రదర్శన కేంద్రాన్ని రిబ్బన్ కటింగ్ చేసి ప్రారంభించారు. అనంతరం ఆయన నిర్వాహకులతో కలిసి చేపల ప్రదర్శన టన్నెల్ లోకి ప్రవేశించి టన్నెల్ లో ఉన్న చేపలను ఆసక్తిగా చూసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వరంగల్ నగరంలో ఎన్నో ఎగ్జిబిషన్లు వచ్చాయని మొట్టమొదటిసారి రకరకాల సముద్రపు చేపల తో ప్రదర్శనను నగరవాసులు తిలకించేలా ప్రదర్శించడం అభినందనీయమని అన్నారు అన్నారు. టన్నెల్లోకి వెళ్తుంటే సముద్రం లోపలికి వెళ్లిన అనుభూతి కలిగిందని అన్నారు. 200 కేజీలు గల చేప అద్భుతంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో టన్నెల్ నిర్వాహకులు గాలం కార్తికేయ, మిరియాల ధర్మేందర్ (చంటి), ఆకుతోట శిరీష్, మాజీ కార్పొరేటర్ ఎలుగం లీలావతి సత్యనారాయణ, మండల సురేష్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking