సాహితి ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్లెట్స్ పంపిణీ…

– ఫౌండేషన్ చైర్మన్ రాముల కుమార్ ఆధ్వర్యంలో

జమ్మికుంట ప్రజాబలం ప్రతినిధి జూన్ 19

జమ్మికుంట సాహితి ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని కొత్తపల్లి లో గల గార్డియన్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో.బుధవారం పాఠశాలకు వచ్చిన విద్యార్థులకు స్లెట్స్ (పలకలు )పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సాహితి ఫౌండేషన్ చైర్మన్ రాముల కుమార్. మాట్లాడుతూ విద్యార్థులకు తక్కువ ఫీజులో నాణ్యమైన విద్యను అందించడానికి పాఠశాలను నిర్వహించడం జరుగుతుందని, ఆర్థిక సంపాదన మా లక్ష్యం కాదని, ప్రజలకు సేవ చేయడమే మా ఉద్దేశమని దీనిలో భాగంగానే ఈరోజు మొదటగా హాజరైన 50 మంది విద్యార్థులకు పలకల పంపిణీ చేశామని, సంవత్సరంలో ప్రతిసారి సందర్భాన్ని బట్టి పిల్లలకు సౌకర్యాలు కల్పిస్తామని జమ్మికుంట పరిసర ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకొని నాణ్యమైన విద్యను పొందాలని,తల్లిదండ్రులు హంగులు,ఆర్భాటాలకు వెళ్లి ఆర్థికంగా నష్టపోవద్దని. మా ఫౌండేషన్ కల్పిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని. తల్లిదండ్రులకు సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కోఆర్డినేటర్ మహమ్మద్ అంకూస్, తల్లిదండ్రులు అధ్యాపక బృందం తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking