మంచిర్యాల పార్క్ ఏర్పాటుకు స్థల పరిశీలన

 

జిల్లా అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు బి రాహుల్

ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి జూన్ 19 : మంచిర్యాల పట్టణంలోని థీమ్ పార్కు ఏర్పాటుకు స్థలాలను పరిశీలించడం జరిగిందని జిల్లా అధనం కలెక్టర్ స్థానిక సంస్థలు బి రాహుల్ తెలిపారు. బుధవారం మున్సిపల్ కమిషనర్ మారుతి ప్రసాద్ మున్సిపల్ అధికారులతో కలిసి మంచిర్యాల పట్టణంలోని శ్రీనివాస గార్డెన్ రాములు చెరువు కాంతలతో పాటు ఐబి చౌరస్తా ఫ్లైఓవర్ బ్రిడ్జి ప్రాంతాలను పరిశీలించారు.ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ మంచిర్యాల పట్టణంలోని థీమ్ పార్క్ ఏర్పాటుకు ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రభుత్వ స్థలాలను పరిశీలించడం జరిగిందని ఈ క్రమంలో శ్రీనివాస గార్డెన్స్ ఏరియాతో పాటు రాముల చెరువు ప్రాంతాలలో భూములను పరిశీలించడం జరిగిందని,స్థలాలను గుర్తించి ప్రభుత్వానికి ప్రతి పాదాలను పంపించడం జరుగుతుందని తెలిపారు. పట్టణంలోని ఐబి చౌరస్తాలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూతన విగ్రహ ఏర్పాటుకు అన్ని అనుమంతులతో సిద్ధంగా ఉన్నామని,ఈ నేల 6వ తేదీ వరకు లోక్ సభ ఎన్నికల నియమావళి అమలులో ఉండటంతో పనులు నిలిపివేయాడం జరిగిందని, త్వరలోనే ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. పై ఓవర్ సమీపం లో ప్రజలకు ఉపయోగపడేలా పబ్లిక్ టాయిలెట్స్ ఏర్పాటుకు అవసరమైన ప్రతి పాదాలను సిద్దం చెయ్యాలని అధికారులను ఆదేశించారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ డి.ఈ.మధు, ఎ.ఈ.రాజు,సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking