హైదరాబాద్ జూన్ 15 ;కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి జన్మదినం సందర్భంగా రెడ్ క్రాస్ మరియు కీర్తి రెడ్డి ఫౌండేషన్ ఆద్వర్యం లో క్షయ వ్యాధి కిట్స్ పంపిణీ : కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారి జన్మదినం సందర్భంగా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ హైదరాబాద్ జిల్లా శాఖ సౌజన్యం తో కీర్తి రెడ్డి ఫౌండేషన్ వారి సహకారంతో స్టేట్ టిబి కన్వీనర్ డా. విజయ్ భాస్కర్ గౌడ్ గారి అధ్వర్యంలో యూసుఫ్ గూడ, శ్రీ రామ్ నగర్ కాలనీ, క్షయ వ్యాధి సెంటర్ లో రెడ్ క్రాస్, హైదరాబాద్ జిల్లా శాఖ చైర్మన్ మామిడి భీమ్ రెడ్డి మరియు కీర్తి రెడ్డి ఫౌండేషన్ ఛైర్ పర్సన్ కీర్తి రెడ్డి గార్ల చేతుల మీదుగా క్షయ వ్యాధి పేషెంట్ లకు క్షయ వ్యాధి పౌష్టికాహార కిట్స్ ను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా చైర్మన్ గారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ టిబి వ్యాధి పట్ల అవగాహన కలిగి ఉండాలని సూచించారు. అంతే కాకుండా సేవాభావం ను కూడా అలవాటు చేసుకోవాలని కోరారు. మరింత మంది దాతలు ముందుకు వచ్చి క్షయ వ్యాధి రోగులు ను ఆదుకోవాలని తెలిపారు. కీర్తి రెడ్డి మాట్లాడుతూ గవర్నర్ గారి ఆలోచన విధానాన్ని ముందు కు తీసుకెళ్ళి రాష్ట్రంలో 2024 సంత్సరo చివరకు మన రాష్ట్రం లో ఒక్క క్షయ వ్యాధి పేషెంట్ లేకుండా చేస్తామని తెలిపారు. మాకు ఇలాంటి సహాయ సహకారాలు అందిస్తున్న రెడ్ క్రాస్, హైదరాబాద్ జిల్లా శాఖ కు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీ రామ్ నగర్ టిబి సూపర్ వైజర్ కిషన్ రెడ్డి, శ్రీ రామ్ నగర్ టిబి స్టాఫ్, వెంకట్ మరియు రెడ్ క్రాస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.