ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి మార్చి 11 : మంచిర్యాల జిల్లాలోని లక్షెట్టిపేట పట్టణంలోని పదవ తరగతి చదువుతున్న విద్యార్థులలో ప్రతి పాఠశాల నుండి ఐదుగురు టాపర్స్ కు ప్రతిభా పరీక్ష ను నిర్వహిస్తున్నారు.ఈ సందర్భంగా అడిషనల్ కలెక్టర్ రాహుల్ మాట్లాడుతూ… మన లక్షెట్టిపేట జడ్పీహెచ్ఎస్ గర్ల్స్ పాఠశాల యందు ప్రతిభా పరీక్ష కేంద్రము ఏర్పాటు చేయబడింది. శనివారం ఉదయము 10:00 నుండి మధ్యాహ్నం 01:00 వరకు నిర్వహించబడును. ఈ పరీక్షా కేంద్రంలో లక్షెట్టిపేట దండేపల్లి మరియు జన్నారం విద్యార్థులు ప్రతిభ పరీక్షలో పాల్గొంటున్నారు. ఇది మన రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా మరియు వినోదనంగా ఏర్పాటు చేసి ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల యొక్క ప్రతిభను గుర్తించడానికి ఉపయోగపడుతుందని డిఈవో ద్వారా ఏర్పాటు చేయబడినది