ప్రజాబలం ప్రతినిధి నిర్మల్ జిల్లా..సోమవారం నిర్మల్ జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ ను ఉత్తమ హస్తకళల విభాగంలో బెస్ట్ టూరిజం విలేజ్ అవార్డును స్వీకరించినందుకు గానూ,జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్,ఇతర జిల్లా అధికారుల సమక్షంలో అభినందించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, బెస్ట్ టూరిజం విలేజ్ అవార్డును స్వీకరించినందుకు అదనపు కలెక్టర్ కు శుభాకాంక్షలు తెలియజేశారు. అవార్డు సాధించేందుకు చేసిన కృషికి గాను ఆయనను అభినందించారు. అనంతరం స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ మాట్లాడుతూ,బెస్ట్ టూరిజం విలేజ్ అవార్డు అందుకోవడం సంతోషంగా ఉందని తెలిపారు.అవార్డును సాధించేలా ప్రోత్సహించిన జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ కు ధన్యవాదాలు తెలియజేశారు.
కాగా సెప్టెంబర్ 27 వ తేదీ అంతర్జాతీయ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకుని డిల్లీ లోని విజ్ఞాన భవన్ లో పర్యాటక రంగానికి సంబంధించి ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్కడ్ అధ్యక్షతన జరిగిన అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమంలో కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ చేతుల మీదుగా జిల్లా స్థానిక సంస్థల అదన కలెక్టర్ అవార్డును అందుకున్నారు.
Prev Post