ప్రజాబలం ప్రతినిధి నిర్మల్ జిల్లా..
శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా నిర్మల్ జిల్లా వ్యాప్తంగా నెల రోజుల పాటు (అక్టోబర్ 1వ తేది నుండి 31 వరకు) 30, పోలీసు యాక్ట్-1861 అమలులో ఉంటుందని జిల్లా ఎస్పీ పత్రిక ప్రకటనలో తెలియజేశారు. కావున పోలీసు అధికారుల ముందస్తు అనుమతి లేనిది జిల్లా ప్రజలు,ప్రజా ప్రతినిధులు ధర్నాలు, రాస్తారోకోలు, నిరసనలు,ర్యాలీలు, పబ్లిక్ మీటింగ్ లు, సభలు,సమావేశాలు నిర్వహించరాదని, శాంతి భద్రతలకు భంగం కలిగించే విధంగా,ప్రజా ధనానికి నష్టం కల్గించే,చట్ట వ్యతిరేక కార్యకలాపాలు చేపట్టకూడదన్నారు. జిల్లా ప్రజలు,ప్రజా ప్రతినిధులు,వివిధ సంఘాల నాయకులు ఇట్టి విషయంలో పోలీసు వారికి సహకరించవలసిందిగా సూచించారు. అనుమతి లేకుండా పై చర్యలకు పాల్పడితే సంబంధిత వ్యక్తులపై చట్టరిత్య కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.