ప్రజాపాలన పేరిట ప్రజాఅరోగ్యం నిర్లక్ష్యం.!

విషజ్వరాలతో ఇబ్బందులు పడుతున్న ప్రజలు.!
అడ్వకేట్ జగన్ ‌మోహన్,బిఎస్పీ నిర్మల్ జిల్లా ఇంచార్జీ

ప్రజాబలం ప్రతినిధి నిర్మల్ జిల్లా.. ప్రజాపాలన అని గొప్పలు చెప్పుకునే కాంగ్రేస్ సర్కార్ ప్రజా ఆరోగ్యాన్ని పాతరేసారని, విషజ్వరాలతో ప్రణాంతక వ్యాదులతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని బిఎస్పీ నిర్మల్ జిల్లా ఇంచార్జీ అడ్వకేట్ జగన్ మోహన్ అన్నారు.
నిర్మల్ జిల్లా కేంద్రంలో ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి వద్ద మీడియాతో
జగన్ మోహన్ మాట్లాడుతూ.ప్రజారోగ్యం వ్యవస్థను ప్రభుత్వం గాలికి వదిలేయడంతో జనం విషజ్వరాలతో మంచం పడుతున్నారని దుయ్యబట్టారు.గత తొమ్మిది నెలలు గా పారిశుద్ద్యం నిర్వహణ సక్రమంగా లేకపోవడంతో దోమల బెడద పెరిగి చికెన్ గున్యా, డెంగ్యూ, టైపాయిడ్ లాంటి ప్రణాంతక వ్యాధులతో ప్రజలు నిర్మల్ జిల్లాలో పల్లెలు,పట్టణం అని తేడా లేకుండా రోగుల సంఖ్య పెరిగిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. సీజన్ కు ముందే చర్యలు తీసుకోవాలని కనీస అవగాహణ సర్కారుకు లేకపోవడంతోని ప్రజలు విషజ్వరాల బరిన పడే దుస్థితి నెలకొందని దుయ్యబట్టారు.ప్రజల ప్రణలంటే సర్కారుకు లెక్క లేదా అని ప్రశ్నించారు, ప్రైవేటు ఆసుపత్రులపై నియంత్రణ లేకపోవడంతో రోగుల వద్ద నుంచి భారీగా డబ్బులు దండుకుంటున్నారని ఆరోపించారు. విష జ్వరాలు ప్రబలకుండా పారిశుద్ధ్యం నిర్వహణకు ప్రథమ ప్రాధాన్యం ఇవ్వాలని,దోమల బెడద లేకుండా ఇప్పటికైనా ప్రటిష్ట మైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా జిల్లా లోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో సిబ్బంది కొరతను నివారించి, విష జ్వరాల పరీక్షలు పెంచాలని, మందుల కొరత లేకుండ చూడాలని జగన్ మోహన్ డిమాండ్ చేశారు. ఈ సమావేషంలో పాల్గోన్నవారు బిఎస్పీ సీనియర్ నాయకులు చాత మారుతి,మహిళకన్వీనర్ ఎస్కే.యాదవ్,రాయుడు,పులి శ్రీనివాస్,గైక్వాడ్ జైయ్ శ్రీ నాయకులు పాల్గోన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking