ప్రజాబలం ప్రతినిధి నిర్మల్ జిల్లా..
శుక్రవారం పట్టణంలోని సోమవార్ పేట్ ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలను ఆమె ఆకస్మికంగా సందర్శించారు. ముందుగా పాఠశాల పరిసరాలను పరిశీలించారు. పిచ్చిమొక్కలను తొలగించి పరిశుభ్రంగా ఉంచాలని ఉపాధ్యాయులకు సూచించారు. అనంతరం మధ్యాహ్న భోజనంను పరిశీలించి, విద్యార్థులతో కలిసి కలెక్టర్ మధ్యాహ్న భోజనం చేశారు. భోజనం రుచి, తరగతుల వారీగా విద్యాబోధన, క్రీడలు, హాజరు, ఉత్తీర్ణత శాతం,ఏకరూప దుస్తులు,పాఠ్య, నోటు పుస్తకాల పంపిణీ తదితర అంశాలను విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం తరగతి గదిలో సబ్జెక్టుల వారీగా విద్యార్థులను ప్రశ్నలు అడిగి జవాబులు రాబట్టారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రైవేటుకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలలో మెరుగైన వసతులు కల్పించాలని ఆదేశించారు. పరిసరాలు బాగుండి, నాణ్యమైన విద్యా బోధనా ఉంటేనే విద్యార్థులు శ్రద్ధగా చదువుకుంటారని అన్నారు. ప్రతివిద్యార్థి కష్టపడి చదివి జీవితంలో ఉన్నత స్థానాల్లో నిలవాలని, పాఠశాలకు, తల్లిదండ్రులకు గొప్ప గుర్తింపు తీసుకురావాలని కోరారు. విద్యతో పాటు విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా మెరుగైన వసతులు కల్పించాలని ఉపాధ్యాయులకు సూచించారు. అలాగే అంగన్వాడి కేంద్రమును సందర్శించి పిల్లలకు ప్రతిరోజు గ్రుడ్డు,పాలు, పౌష్టికాహారం అందించాలని సిబ్బందిని ఆదేశించారు.కేంద్రంలో శుభ్రత పాటించాలని, ప్రతి చిన్నారి ఎత్తుకు తగిన బరువు ఉండేలా పర్యవేక్షించాలని సూచించారు. అనంతరం అమ్మ ఆదర్శ పాఠశాలలో కార్యక్రమంలో భాగంగా పాఠశాలలో చేపట్టిన త్రాగునీరు, టాయిలెట్స్,మైనర్, మేజర్ రిపేర్లు,బాలికల కోసం మరుగుదొడ్లు, విద్యుద్దీకరణ వంటి పనులు, చేపట్టవలసిన పనుల వివరాలు అధికారులను అడిగి తెలుసుకున్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి రవీందర్ రెడ్డి, ఉపాధ్యాయులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు