ప్రజాబలం ప్రతివీధి నిర్మల్ జిల్లా..
సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణిలో నిర్మల్ జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల నుండి కలెక్టర్ దరఖాస్తులను స్వీకరించారు.రైతు రుణమాఫీ,విద్య, వైద్యం,వ్యవసాయం, పింఛన్లు,ధరణి,భూ సమస్యలు,డబుల్ బెడ్ రూమ్ రైతు రుణమాఫీ వంటి సమస్యలను పరిష్కరించాలని ప్రజలు తమ అర్జీలను సమర్పించారు. ప్రజావాణి కార్యక్రమం అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ, ప్రజావాణి దరఖాస్తులను నిర్ణిత గడువులోగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.శాఖల వారీగా ఇప్పటివరకు పెండింగ్ లో ఉన్న దరఖాస్తులు,సీఎం ప్రజావాణి దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పర్యవేక్షించి పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.ఈరోజు ప్రజావాణిలో వివిధ శాఖలకు సంబంధించి 86 అర్జీలు వచ్చాయని తెలిపారు.శాఖల వారీగా వచ్చిన దరఖాస్తులను పరిష్కరించినప్పుడు వాటికి సంబంధించిన వివరాలను క్లుప్తంగా రిమార్కుల విభాగంలో పొందుపరుచాలని ఆదేశించారు. దరఖాస్తుదారులకు పరిష్కారానికి సంబంధించిన వివరాలను అందజేయాలన్నారు.
ప్రజావాణి కార్యక్రమం అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ, ఎండలు తీవ్రస్థాయిలో ఉన్నందున,జిల్లాలో ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చర్యలను చేపట్టాలని అధికారులను ఆదేశించారు.ప్రజలకు త్రాగునీటి సమస్య లేకుండా చూడాలన్నారు. వడదెబ్బతో అనారోగ్యానికి గురై ఆసుపత్రులకు వచ్చే రోగులకు అన్ని రకాల మందులు,సెలైన్ బాటిళ్లు ఓఆర్ఎస్ పొట్లాలు తగినన్ని అందుబాటులో ఉంచాలన్నారు. మొక్కలు ఎండిపోకుండా ఉండేందుకు ఎప్పటికప్పుడు నీటిని అందించాలన్నారు. జిల్లాలో కొయ్య బొమ్మల తయారీకి ఉపయోగించే పోనికి కర్రను సమకూర్చుకోవడానికి పొనికి వనాన్ని సమర్థవంతంగా నిర్వహిస్తున్నందుకు డిఆర్డిఓ విజయలక్ష్మి ని కలెక్టర్ అభినందించారు.జిల్లా అధికారుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సమకూర్చిన స్టీల్ నీళ్ల సీసాలను కలెక్టర్ అధికారులకు అందించారు.ప్లాస్టిక్ వాడకం తగ్గించడంలో భాగంగా స్టీల్ నీళ్ళ సీసాల వైపు మళ్లిన అధికారులను కలెక్టర్ అభినందించారు. అన్ని కార్యాలయాల్లో ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా నిర్మూలించాలని ఈ కలెక్టర్ సందర్బంగా తెలిపారు.
ఈ ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు ఫైజాన్ అహ్మద్,కిషోర్ కుమార్,ఆర్డిఓ రత్నకళ్యాణి,వివిధ శాఖల అధికారులు, సిబ్బంది,తదితరులు పాల్గొన్నారు