నిర్మల్ పట్టణ అభివృద్ధికి అధికారులు, కౌన్సిలర్ లు సమన్వయంతో పనిచేయాలి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్

ప్రజాబలం ప్రతినిధి నిర్మల్ జిల్లా.. బుధవారం స్థానిక నిర్మల్ మున్సిపల్ కార్యాలయంలో 2023-24 బడ్జెట్, 2024-25 అంచనాలు సంబంధించి నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ముందుగా పట్టణంలోని వివిధ కాలనీలలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని కౌన్సిలర్లు కలెక్టర్ కు విన్నవించారు.
అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ, మున్సిపాలిటీ పరిధిలోని సమస్యల పరిష్కారానికి అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో చర్యలు చేపట్టాలని సూచించారు. వందశాతం ఇంటిపన్ను వసూలు చేయాలనీ, ఇందుకు కౌన్సిలర్లు సహకరించాలని కోరారు. బడ్జెట్ కు సంబంధించి బల్దియా లో పని చేస్తున్న అధికారులు,కౌన్సిలర్ లు అందరూ అవగాహన కలిగి ఉండాలని, ఖర్చు చేసిన ప్రతి రూపాయి లెక్క పారదర్శకం గా ఉండాలని, ముఖ్యంగా అభివృద్ధి లో వెనుకబడిన ప్రాంతాలకు అధిక మొత్తంలో నిధులు కేటాయించాలని సూచించారు. ప్రతి వార్డుల్లో పరిసరాల పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యతనివ్వాలని అన్నారు. ప్రతిరోజూ ప్రతి ఇంటి నుండి తడి, పొడి చెత్తను వేరువేరుగా సేకరించి డంపింగ్ యార్డుకు తరలించాలని సూచించారు. వేసవి కాలం నేపథ్యంలో పట్టణంలో నీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని అన్నారు. ప్రభుత్వ నిబంధనల మేరకు భవన నిర్మాణాలకు అనుమతులు మంజూరు చేయాలని అధికారులను ఆదేశించారు. మంచిర్యాల చౌరస్తా లో నిర్మించిన స్మశాన వాటికలో నీటి వసతి కల్పించాలని సూచించారు.
ఈ కార్యక్రమం లో మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్, అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్, కమీషనర్ రాజు, కౌన్సిలర్లు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking