విద్యార్థులు లక్ష్యసాధనకై శ్రమించాలి. సైన్స్ జీవితంలో ఒక భాగం.

హుజరాబాద్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ వోడితెల ప్రణవ్.

హుజురాబాద్ ప్రజాబలం ప్రతినిధి ఫిబ్రవరి 28బుధవారం జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా హుజురాబాద్ పట్టణంలోనీ శ్రీ చైతన్య స్కూల్ ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ సైన్స్ దినోత్సవాన్ని ఘనంగా జరిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వోడితల ప్రణవ్ హాజరయ్యారు. ముందుగా సివి రామన్ చిత్ర పటానికి ప్రణవ్ పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం సైన్స్ షో (ఎగ్జిబిషన్)నుప్రారంభించారు.


ఆయన మాట్లాడుతూ విద్యార్థులు నిర్దిష్ట లక్ష్యాలను ఏర్పరచుకొని వాటి సాధనకై శ్రమించాలని సమాజానికి దిక్సూచిలా విద్యార్థులు ఎదగాలని అన్నారు. సైన్స్ జీవితంలో ఒక భాగం అని స్పష్టం చేశారు విజ్ఞాన శాస్త్రానికి గుర్తు చేశారు. ఇలాంటి కార్యక్రమాల వల్ల విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీయవచ్చని అన్నారు

సివి రామన్ శ్రీనివాస రామానుజన్ అబ్దుల్ కలాం లాంటి వారిని ఆదర్శంగా తీసుకొని విద్యార్థులు ముందుకు సాగాలని సూచించారు విద్యార్థులు ఎల్లప్పుడూ ఉపాధ్యాయులను తల్లిదండ్రులను పెద్దలను గౌరవించాలని అన్నారు ఈ కార్యక్రమంలో పాఠశాల చైర్మన్ మల్లెంపాటి శ్రీధర్ డైరెక్టర్స్ శ్రీవిద్య, రాజు కోఆర్డినేటర్ ప్రవీణ్, శ్రీనివాస, ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు,విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking