ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 22 : మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం లోని కొర్విచెల్మ గ్రామం ప్రజలు గూడెం ఎత్తిపోతల పథకం ద్వారా రైతులకు నీరు అందక ఎండిపోయి పంట పొలాలకు నీళ్లు ఇవ్వాలని కలెక్టర్ బదావత్ సంతోష్ కు బుధవారం వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ….స్థానిక ఎమ్మెల్యే నడిపల్లి దివాకర్ రావు మా గ్రామంలోకి వంచి మాకు వరి పొలాలు వెసుకుని చెప్పారు,కాబట్టి మేము రైతులు అందరూ కలిసి వరి పొలాలు వెసుకుని చెప్పడంతో వెసుకుంన్నాము కానీ మాకు నీళ్లు అందాకా ఎండిపోయి వరి పోలాలు, గుడెం గొదావరి లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా రైతులకు నీరు అందక ఎండిపోయి వరి పొలాలు నీళ్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు.లేని పక్షాన రైతులకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా ప్రతి సారి పైపులు లేవడంతో ప్రతిసారి రైతులకు నిన్ను అందాకా ఎండిపోయి మాకు నాష్టం జరుగుతుందని తెలిపారు.గూడెం కొత్త పైపులు వేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కారుకూరి మల్లేష్,ముద్దసాని భీమయ్య, చింతం కొమరయ్య,బుద్దె సత్తయ్య,దస్తాగిరి గౌడ్,పెంకర్ల శ్రీనివాస్,వారికి మద్దతుగా బిజెపి కిషన్ మోర్చా రాష్ట్ర నాయకులు తుమ్మినేని శ్రీనివాస్,బోప్పు సత్యం, తదితరులు పాల్గొన్నారు.