తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులుగా దామోదర్ రెడ్డి సెక్రటరీ జనరల్ గా చంద్రశేఖర్

హైదరాబాద్ ఫిబ్రవరి 22 ();తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రిటైర్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర కౌన్సిల్ సమావేశాలు ఈనెల 21, 22 తేదీల్లో హైదరాబాద్ లోని రెడ్డి హాస్టల్లో జరిగాయి. ఈ సమావేశాల్లో కార్యనిర్వాక కార్యవర్గ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు అత్యధిక సంఖ్యలో పాల్గొన్నారు. 22 వ తేదీన రాష్ట్ర అధ్యక్ష పదవికి జరిగిన ఎన్నికల్లో 540 ఓట్ల మెజార్టీతో దామోదర్ రెడ్డి ఘనవిజయం సాధించారు. సెక్రటరీ జనరల్గా చంద్రశేఖర్ తో పాటు మిగతా కార్యనిర్వాక పదవులకు ఏకగ్రీవంగా ఎన్నికలు జరిగాయి.
రాష్ట్ర కార్యనిర్వాకవర్గం
అసోసియేట్ అధ్యక్షులుగా వి.విశ్వనాథం, ఉపాధ్యక్షులుగా జి. మోహన్ రెడ్డి, పి ఆర్ మోహన్, జి .శ్రీనివాసరెడ్డి, ఆర్. సీతారామయ్య, పి. శ్రీహరి రెడ్డి, వి. భాగ్యలక్ష్మి ఎన్నికైనారు. కార్యదర్శులుగా పి, శ్యామ్ రావు, తిరువరంగం ప్రభాకర్, విష్ణువర్ధన్ రెడ్డి, పి. శరత్ బాబు, ఏ పీ విజయలక్ష్మి, ఎన్నికైనారు. ఆర్గనైజింగ్ సెక్రటరీలుగా జి. భక్కారెడ్డి, ఎమ్. ఈశ్వరయ్య, రఘునాథ్ రెడ్డి, పి నాగేశ్వరరావు, ఏ .లక్ష్మీనరసింహారావు, ఎన్నికైనారు. ట్రెజరర్ గా ఏ గంగారెడ్డి , జాయింట్ సెక్రెటరీలుగా చందులాల్, శ్రీ వాత్సవ్ ఎం. రవీందర్ రెడ్డి, ఎం. శంకర్ రెడ్డి, పి. పెంటయ్య, పబ్లిసిటీ సెక్రటరీగా బి. ప్రహ్లాద రావు, ఎన్నికైనట్లు కార్య దర్శి తిరువరంగం ప్రభాకర్ తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking