10వ తరగతి పరీక్ష ఫలితాల్లో జిల్లా, రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలిచేలా సమిష్టిగా కృషి చేయాలి
ఉదయం, సాయంత్రం ప్రత్యేక తరగతులు నిర్వహించాలి
విద్యార్థులను పూర్తి స్థాయిలోపరీక్షలకు సిద్ధం చేయాలి
చదువులో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించాలి
విద్యార్థుల భవిష్యత్తుకు పునాది పదవ తరగతి
ఉద్యోగ బాధ్యతను, కర్తవ్యాన్ని మరవద్దు
………..జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్
పదవ తరగతిలో వంద శాతం ఉత్తీర్ణత సాధించేలా హెచ్ఎంలు,ఉపాధ్యాయులు,ఆయా అధికారులు సమిష్టి గా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్ సూచించారు.
బుధవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో కలెక్టర్ శరత్ పదవ తరగతి విద్యా బోధన, ప్రత్యేక తరగతుల నిర్వహణ, విద్యార్థులకు స్నాక్స్ అందించడం, క్యాటరింగ్, నాణ్యత గల ఆహారం అందించడం, పర్యవేక్షణ,తదితర అంశాలపై ఎంఈఓ లు, ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, వసతి గృహాల సంక్షేమ అధికారులు, సరకుల రవాణా కాంట్రాక్టర్లు, తదితరులతో సమీక్షించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలలో 10వ తరగతిలో వంద శాతం ఫలితాలు సాధించేలా ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు సమిష్టిగా కృషి చేయాలని కోరారు.
ఎస్ఎస్ సి ఫలితాల్లో జిల్లా రాష్ట్రంలో ప్రథమ స్థానంలో ఉండాలని మంత్రి ఆకాంక్షించారన్నారు. ప్రతి ఒక్కరు తమ ఉద్యోగ బాధ్యతను, కర్తవ్యాన్ని మరవద్దని అన్నారు .
విద్యార్థి భవిష్యత్తుకు పదవ తరగతి పునాది లాంటి దన్నారు. సబ్జెక్టు టీచర్లు, ప్రధానోపాధ్యాయులు సమన్వయంతో టీంగా పనిచేస్తే అనుకున్న ఫలితాలు వస్తాయన్నారు.
ప్రస్తుత సంవత్సరం 6 పేపర్లలో పరీక్షలు నిర్వహిస్తున్నందున, దానికి తగిన విధంగా విద్యార్థులను సిద్ధం చేయాలని, ప్రతి పాఠశాలలో వంద శాతం ఉత్తీర్ణత సాధించాలన్నారు.
10వ తరగతి విద్యార్థులకు ప్రతి రోజూ ఉదయం సాయంత్రం తమ తమ నిర్దేశిత సమయాలలో ప్రత్యేక తరగతులు నిర్వహించాలని తెలిపారు.
స్నాక్స్ కొరకు ఒక్కో విద్యార్థికి పదిహేను రూపాయల చొప్పున ప్రభుత్వం ఇస్తుందని ,మంచి స్నాక్స్ ఇవ్వాలన సూచించిన కలెక్టర్
చదువులో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, ఆయా సబ్జెక్టులలో విద్యార్థుల బోధన విషయంలో సబ్జెక్టు టీచర్ల పాత్ర కీలకమన్నారు. వారందరినీ యూనిట్ గా పని చేయించే బాధ్యత హెచ్ఎంలదని పేర్కొన్నారు.
ప్రతి విద్యార్థి ఫలితాలపై ఉపాధ్యాయులు అవగాహన కల్గి ఉండాలన్నారు. పిల్లల చదువు విషయంలో తల్లిదండ్రులతో ఎప్పటికప్పుడు అడిగి తెలుసు కోవాలన్నా రు. ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో వంద శాతం ఫలితాలు వస్తాయన్న ధీమా, విశ్వాసం ప్రజలకు కలిగించాలన్నారు.
రెసిడెన్షియల్ పాఠశాలలు, మోడల్ స్కూల్స్, కేజీవీబీలు, వసతి గృహాలలో ఆయా విద్యార్థుల చదువు విషయమై సంబంధిత ప్రిన్సిపల్స్, వసతి గృహాల సంక్షేమాధికారులు, ప్రత్యేక శ్రద్ధ తీసుకోవా లన్నారు.వసతి గృహాలలో నూటికి నూరు శాతం ఫలితాలురావాలని,
లేనట్లయితే ఆయా సబ్జెక్టు టీచర్, వసతి గృహ సంక్షేమ అధికారి పై చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు.
వసతి గృహాలలో విద్యార్థుల చదువు తీరుతెన్నులపై జిల్లా సంక్షేమ శాఖల అధికారులు పర్యవేక్షించాలని సూచించారు.
విద్యార్థులకు భోజనం సరిగ్గా పెట్టకపోతే సహించబోమని హెచ్చరించారు.
విద్యార్థులకు అందిస్తున్న భోజనం నాణ్యతగా ఉండాలని, మెనూ ప్రకారం అందించాలన్నారు. బ్రాండెడ్ సరుకులు ఉండాలని, సప్లయర్స్ సరియైన సరుకులు సరఫరా చేయాలన్నారు. సరకులు,భోజనం నకు సంబంధించిన విషయంలో పర్యవేక్షణ విధిగా ఉండాలన్నారు.
అనంతరం పదవ తరగతి ఫలితాలు వంద శాతం సాధించడానికి సమిష్టిగా కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేయించారు.
ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ వీరారెడ్డి, జిల్లా విద్యాశాఖ అధికారి రాజేష్, , ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సంక్షేమ శాఖల అధికారులు, ఆర్ సి ఓ లు, ఎం ఈ ఓ లు, వసతి గృహ సంక్షేమ అధికారులు,
ఉన్నతపాఠశాలల
ప్రధానోపాధ్యాయులు, కేజీబీవీ, మోడల్ స్కూల్స్, రెసిడెన్షియల్ స్కూల్స్ ప్రిన్సిపాల్స్, తదితరులు పాల్గొన్నారు.