మహిళల, బాలికల భద్రతకు భరోసా.. మౌనం వీడి, నిర్భయంగా ముందుకు వచ్చి తమకు జరిగిన వేధింపుల గురించి వివరించి సహాయం పొందలన …జిల్లా ఎస్పీ. శ్రీ. యం. రమణ కుమార్

సంగారెడ్డి ఫిబ్రవరి 22 ప్రజాబలం ప్రతినిధి • ఉమెన్ సేఫ్టీవింగ్ ఆధ్వర్యంలో భరోసా సెంటర్ సంగారెడ్డి వారు ఫోక్సో చట్టం అమలు, నేరవిచారణపై యస్.హెచ్.ఒ. లకు, స్టేషన్ రైటర్స్ కు పోలీస్ కళ్యాణ మండపంలో ఒక రోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది.
• ఈ కార్యక్రమానికి భరోసా సెంటర్ అదనపు ఎస్పీ అశోక్ గారు మరియు భరోసా టెక్నికల్ డైరెక్టర్ డా. మమతా రఘువీర్ ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
ఈ సంధర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ.. భరోసా సెంటర్ ద్వారా మహిళల పై జరుగుతున్న వివిధ రకాల నేరాలను నియంత్రించడానికి స్కూల్ లలో, కళాశాలలో అవగాహన (prevention of child sexual abuse) కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలు ఎలాంటి అలవాట్లకు గురి అవుతున్నారు, టి.వి, సెల్ ఫోన్ లలో ఎలాంటి కార్యకలాపాలు చేస్తున్నారు అని కనిపెట్టుకొని వుండాలన్నారు. మహిళలు, పిల్లలు ఎలాంటి మానసిక, శారీరక వేదింపులకు గురైన వెంటనే తమ దృష్టికి తీసుకురావలన్నారు. మహిళలపై లైంగిక దాడులకు పాల్పడిన వారిని చట్టం ముందు దోషులుగా నిలబెట్టాలని యస్.హెచ్.ఒ. లకు సూచించారు. పోక్సో కేసులలో నాణ్యమైన నేర విచారణ త్వరితగతిన పూర్తి చేసి, తుదినివేదికను రెండు నెలలో కోర్టుకు సమర్పించాలన్నారు. లైంగిక దాడులకు గురైన బాధితుల వివరాలను గోప్యంగా వుంచి, బరోస కల్పిండంతో పాటు వారికి పూర్తి సహయ సహకారాలను అందిస్తూ, పోక్సో కేసు నమోదు అయినప్పటి నుండి చివరి వరకు బాధితులకు అండగా వుంటూ, నెరస్తులకు శిక్ష పడేలా చేయడమే భరోసా ముఖ్య ఉద్ధేశ్యం అన్నారు.
ఈ సంధర్భంగా భరోసా సెంటర్ అదనపు ఎస్పీ శ్రీ అశోక్ (ఉమెన్ సేఫ్టీవింగ్) గారు మాట్లాడుతూ.. పోక్సో కేసులలో నేర విచారణ ఏవిధంగా చేయాలి, భాదిత మహిళలతో మాట్లాడేటప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తల గురించి క్షుణ్ణంగా వివరించారు. పోక్సో కేస్ నమోదు అయిన వెంటనే భరోసా సెంటర్ కు సమాచారం అందించాలని భరోసా సెంటర్లో మహిళా ఎస్సై, అనుభవజ్ఞులైన భరోసా సిబ్బంది మరియు లీగల్ అడ్వైజర్స్ ఉంటారని, వారి విలువైన సలహాలు సూచనలు బాధిత మహిళలకు కొండంత ధైర్యాన్ని ఇస్తాయన్నారు. బాధిత మహిళ యొక్క స్టేట్మెంట్ రికార్డ్ చేయడం, అదేవిధంగా అవసరాన్ని బట్టి మెడికల్ పరీక్షలు నిర్వహించడం వంటివి మహిళా సిబ్బంది ఆద్వర్యంలో నిర్వహించడం జరుగుతుందన్నారు.
ఈ సంధర్భంగా భరోసా టెక్నికల్ డైరెక్టర్ డా. మమతా రఘువీర్ (ఉమెన్ సేఫ్టీవింగ్) గారు మాట్లాడుతూ.. పోక్సో కేసుల నివారణకు పోలీసులు మరిన్ని అవగాహన కార్యక్రమాలను నిర్వహించాలని ప్రజలలో పోలీసులపై ఉన్న నమ్మకంతో పోలీసు వారు చేసిన అవగాహన కార్యక్రమాలు ప్రజలలోనికి వెళ్తాయని అవగాహన వలన పోక్సో కేసులను కొంతవరకు అరికట్టగలమని అన్నారు. జిల్లాలో భరోసా సిబ్బంది యొక్క సేవలను వినియోగించుకోవాలని సూచించారు.
ఈ సమావేశంలో అదనపు ఎస్పీ. శ్రీమతి టి. ఉషావిశ్వనాథ్ గారు, పటాన్చెరు డిఎస్పి భీమ్ రెడ్డి, జహీరాబాద్ డిఎస్పి రఘు, నారాయణఖేడ్ డి.యస్.పి. కె. వెంకట్ రెడ్డి, బాలాజీ డి.యస్.పి. డి.సి.ఆర్.బి జిల్లా సిఐలు మరియు ఎస్ఐలు, స్టేషన్ రైటర్స్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking