రైతులకు కనీస మద్దతు ధర అందించేందుకు కొనుగోలు కేంద్రాల ఏర్పాటు జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్

ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి ఏప్రిల్ 15 : రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని, రైతులు దళారీ వ్యవస్థను నమ్మి మోసపోకుండా కొనుగోలు కేంద్రాల ద్వారా రైతుల వద్ద నుండి ధాన్యం కొనుగోలు చేసే ప్రభుత్వం నిర్ణయించిన కనీస మద్దతు ధర అందించేందుకు కృషి చేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. సోమవారం జిల్లాలోని నస్పూర్ లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయంలో జిల్లా అదనపు కలెక్టర్ (పౌరసరఫరాలు) ఛాంబర్ జిల్లా అదనపు కలెక్టర్ (పౌరసరఫరాలు) సబావత్ మోతిలాల్,జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి వాజిద్, జిల్లా మేనేజర్ గోపాల్ తో కలిసి రైస్ మిల్లర్లు తో సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ… జిల్లాలో ఖరీఫ్ సంబంధిత వరి ధాన్యం సి.ఎం.ఆర్.ప్రక్రియలను సకాలంలో పోటీ చేసే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని,మర పట్టించిన ధాన్యాన్ని సి.ఎం.ఆర్.డెలివరీస్ కింద భారత ఆహార భద్రత సంస్థకు ఇవ్వవలసిన ధాన్యాన్ని సకాలంలో అందించాలని, తెలిపారు.జిల్లా లో మిల్లర్లు సామర్థ్యానికి అనుగుణంగా కేటాయించిన ధాన్యాన్నికి అనుగుణంగా కేటాయించిన దాన్యాన్ని తప్పనిసరిగా మిల్లింగ్ చేసి సకాలంలో అందించాలని తెలిపారు. జిల్లా రోజువారి బిల్డింగ్ సామర్థ్యం 1 వేయి 864 మెట్రిక్ పనులు కలిగి ఉందని ఈ ప్రకారంగా 2023-2024 సంవత్సరానికి సంబంధించిన ఖరీఫ్ సి.ఎం.ఆర్.ను రోజువారీగా నిర్దేశించిన ప్రకారం డెలివరీ చేయాలని తెలిపారు. సి.ఎం.ఆర్ లక్ష్యాలను సకాలంలో పూర్తి చేయాలని తెలిపారు. జిల్లాలోని రైతుల వద్ద నుండి కొనుగోలు కేంద్రాల ద్వారా వరి ధాన్యం కొనుగోలు చేయడం జరుగుతుందని,మధ్య దళారీలను నమ్మి మోసపోకుండా ప్రభుత్వం అందిస్తున్న మద్దతు ధరను రైతులకు అవగాహన కల్పించాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారులు,రైస్ మిల్లర్లు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking