నవమి పట్టాభిషేక ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక ఆల

 

భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి ఏప్రిల్ 13 (ప్రజాబలం) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఈనెల 17, 18వ తేదీన భద్రాచలంలో జరిగే శ్రీ సీతారామచంద్రస్వామి వారి కళ్యాణ మహోత్సవం మరియు పట్టాభిషేకం వేడుకను తిలకించడానికి వివిధ రాష్ట్రాల నుంచే కాక ,వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో వచ్చే అవకాశం ఉన్నందున భద్రాచలం వచ్చే భక్తుల కోసం చలువ పందిళ్లు, త్రాగునీరు, ప్రత్యేక వసతి తో పాటు కళ్యాణ మండపం వద్ద సెక్టార్ల ఏర్పాట్లు సోమవారం సాయంత్రం వరకు పూర్తి కావాలని, విధులకు కేటాయించిన సిబ్బంది 16వ తేదీ ఉదయం 8 గంటల వరకు వారి వారి ప్రదేశాలలో సిద్ధంగా ఉండాలని, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అల సంబంధిత అధికారులకు ఆదేశించారు
శనివారం నాడు భద్రాచలంలోని శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవానికి సంబంధించి ఆలయం వద్ద జరుగుతున్న ఏర్పాట్లను జిల్లా అధికారుల తో కలిసి ఆమె పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కళ్యాణం తిలకించడానికి వచ్చే భక్తులకు కళ్యాణ మండపానికి నేరుగా రావడానికి భక్తులకు తెలిసేలా ముఖ్యమైన ప్రదేశాలలో ఫ్లెక్సీలు రూట్ మ్యాప్ లు ఏర్పాటు చేయాలని, అలాగే భక్తులు కళ్యాణ మండపంలోకి వెళ్లడానికి ఏర్పాటు చేసిన సెక్టార్లలో ప్రత్యేక అధికారులను నియ మించినందున వారు ఉదయం ఎనిమిది గంటల వరకు వారి కేటాయించిన ప్రదేశాలలో ఉండేలా చూడాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. అలాగే ప్రతి సెక్టార్కు ఇద్దరు శానిటేషన్ సిబ్బంది అందుబాటులో ఉండాలని, అలాగే వాహనాలు పార్కింగ్ చేయడానికి వీఐపీలకు మరియు ప్రజలకు వేరువేరుగా ఏర్పాట్లు చేయాలని, పార్కింగ్ ప్రదేశాలలో మంచినీరు, టాయిలెట్లు మెడికల్ కి సంబంధించిన ఏర్పాట్లు చేయాలని అన్నారు. అదేవిధంగా పోలీసు, సమాచార శాఖ, మెడికల్ సంబంధించిన స్టాల్స్, హెల్ప్ డేస్కులు సంబంధించిన బ్యానర్లు ఏర్పాట్లు చేయాలని అన్నారు. ఎండాకాలం నడుస్తున్నందున భక్తులకు వారు బసచేసే ప్రాంతం నుండి కళ్యాణ మండపానికి రావడానికి రవాణా సౌకర్యం ఏర్పాటు చేయాలని, అలాగే 25 లొకేషన్ ల నుండి నడవలేని భక్తులకు ప్రత్యేక వాలంటీర్స్ ద్వారా వీల్ చైర్స్ సౌకర్యం కల్పించాలని అన్నారు. భక్తులు గోదావరిలోకి స్నానానికి వెళ్ళినప్పుడు ఎక్కువ లోతుకి వెళ్లకుండా ప్రమాద సూచికలు ఏర్పాటు చేయాలని, అలాగే గజ ఈతగాళ్లను సిద్ధంగా ఉంచాలని, మరియు భక్తులు గోదావరిలోకి వెళ్లకుండా మైకులు ద్వారా సమాచారం అందిస్తూ ఉండాలని అన్నారు. ఐ టి సి మరియు మిషన్ భగీరథ అలాగే స్వచ్ఛంద సంస్థల ద్వారా భక్తులకు సమయానుకూలంగా మంచినీరు, మజ్జిగ ప్యాకెట్లు, మెడికల్ క్యాంపు ల ద్వారా ఓఆర్ఎస్ పాకెట్లు, మందులు సరఫరా చేయాలని అన్నారు. గోదావరి ప్రాంతానికి వెళ్లలేని భక్తుల కొరకు తాత్కాలికంగా 200 పంపులు ఏర్పాటు చేయాలని, మిషన్ భగీరథ ఎస్సి కి ఆదేశించారు. ఎవరైనా భక్తులు అస్వస్థతకు గురి అయితే సంబంధిత మెడికల్ సిబ్బంది వైద్య పరీక్షలు చేయడానికి కళ్యాణం జరుగు ప్రాంతంలో ప్రత్యేక వైద్య శిబిరం ఏర్పాటు చేయడంతో పాటు అంబులెన్స్లను కూడా సిద్ధంగా ఉంచుకోవాలని అన్నారు. భక్తులు సేదాతీరడానికి ప్రత్యేకమైన కుడళ్ళలో చలువ పందిళ్ళను ఏర్పాటు చేయాలని, అక్కడ మంచినీరు, మజ్జిగ ప్యాకెట్లు భక్తులకు అందించడానికి సిబ్బందిని ఏర్పాటు చేయాలని అన్నారు. కళ్యాణ మండపం మరియు భక్తులు అధికంగా ఉన్న ప్రదేశాలలో ఎప్పటికప్పుడు గ్రామపంచాయతీ సిబ్బంది ద్వారా చెత్తను తొలగించాలని ఈవో గ్రామపంచాయతీకి ఆదేశించారు.అగ్నిమాపక శాఖ ద్వారా భద్రాచలంలోని భక్తులు సెద తీరే ప్రాంతాలలో మరియు కళ్యాణం జరుగు ప్రదేశాలలో తప్పనిసరిగా ఫైర్ ఇంజన్లు అందుబాటులో ఉంచాలని అన్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తుల కోసం ఉచిత తలంబ్రాలు కౌంటర్లు 120, ప్రసాదం కౌంటర్లు 60 ఏర్పాటు చేయాలని, అలాగే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పూర్తిస్థాయిలో సమాచారం అందించడానికి 25 సమాచార కేంద్రాలు ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. భక్తులంతా అధిక సంఖ్యలో వచ్చి స్వామివారి కళ్యాణము మరియు పట్టాభిషేకము తిలకించి స్వామివారిని దర్శించుకొని కళ్యాణ తలంబ్రాలు మరియు ప్రసాదము తీసుకొని సురక్షితంగా వారి వారి ప్రాంతాలకు తిరిగి వెళ్ళడానికి సంబంధిత అధికారులు ప్రత్యేక బాధ్యత తీసుకోవాలని, అధికారులంతా వారి సిబ్బందితో సమన్వయంతో పనిచేసి కళ్యాణము, పట్టాభిషేకము విజయవంతం అవ్వడానికి కృషి చేయాలని కలెక్టర్ తెలిపారు ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ వేణుగోపాల్ దేవస్థానం ఈవో రమాదేవి, ఆర్డిఓ దామోదర్ రావు, డి ఆర్ డి ఓ విద్యా చందన ,ఆర్డబ్ల్యూఎస్ ఈ ఈ తిరుమలేష్, డి ఎం హెచ్ ఓ శిరీష, ఇరిగేషన్ డి ఈ శ్రీనివాస్, ఎస్ డి సి సుమా, డి ఏ ఓ బాబురావు, తాసిల్దార్ శ్రీనివాస్, జిపిఈఓ శ్రీనివాస్ మరియు వివిధ శాఖల అధికారులు సిబ్బంది పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.

Breaking