మున్నేరు సిసి వాల్ ప్రొటెక్షన్ నిర్మాణ పనుల పై నిర్మాణ సంస్థ ప్రతినిధులతో సమావేశమైన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

ఖమ్మం ప్రతినిధి ఏప్రిల్ 13 (ప్రజాబలం) ఖమ్మం మున్నేరు సీసీ వాల్ ప్రొటెక్షన్ నిర్మాణ పనులపై నిర్మాణ సంస్థ ప్రతినిధులతో భేటీ అయిన రాష్ట్ర వ్యవసాయ సహకార చేనేత మార్కెటింగ్ శాఖా మంత్రి వర్యులు తుమ్మల నాగేశ్వరరావు
ఈ సందర్భంగా సంస్థ ప్రతినిధులకు పలు సీసూచలు చేశారు ముఖ్యంగా ఈ ప్రాజెక్ట్ రెండు నియోజకవర్గాల ప్రజలకు సంబంధించినదని, ఇరువైపులా ప్రజలను ఆహ్లాదపరిచే విధంగా నిర్మించాలని,వీలైతే బోటింగ్ కూడా ఏర్పాటు చేయాలని,భవిష్యత్తులో వాల్ ఎత్తు పెంచు కోవడానికి వీలుగా నిర్మాణం చేపట్టాలని సూచించారు అంతే కాకుండా వర్షాకాలంలో ఎంత వరద వచ్చినా మురుగు కాలువల ద్వారా పట్టణంలోకి బ్యాక్ వాటర్ రాకుండా ప్రతిష్టమైన డ్రైనేజీ సిస్టం ను ఏర్పాటు చేయాలని,ప్రాజెక్ట్ మొదలైన ప్రాంతం నుండి ప్రకాష్ నగర్ క్రింద ప్రాంతం వరకు ఎపుడూ నీళ్ళు నిలువ వుండే విధంగా ఏర్పాట్లు చేయాలని అవసరమైతే కొత్త చెక్ డ్యాంల నిర్మాణానికి ప్రపోజల్స్ తయారు చేసి ఖమ్మం పట్టణానికి త్రాగు నీరు ఎద్దడి రాకుండా చూడాలని కోరారు అదేవిధంగా నదిలో చెత్త పడేయకుండా రెయిలింగ్ ఏర్పాటు చేయాలని, వైకుంఠ ధామం దగ్గర స్నానాలు చేయడం కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని అవసరమైన చోట మెట్లు కూడా ఏర్పాటు చేస్తే బాగుంటుందని అన్నారు ప్రాజెక్ట్ కి సంబంధించిన భూసేకరణ విషయంలో ఏదైనా సమస్య తలెత్తితే నా దృష్టికి తీసుకువస్తే కలక్టర్ తో మాట్లాడి సమస్య పర్ష్కారానికి కృషి చేస్తానని నిర్మాణ సంస్థ ప్రతినిధులకు హామీ ఇచ్చారు

Leave A Reply

Your email address will not be published.

Breaking