ప్రత్యేక అధికారులను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అల

 

భద్రాది కొత్తగూడెం ప్రతినిధి ఫిబ్రవరి 01 (ప్రజాబలం) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అల గురువారం గ్రామ పంచాయతీలకు ప్రత్యేక అధికారులను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు విధులు కేటాయించిన ప్రత్యేక అధికారులు సంబంధిత గ్రామపంచాయతీల యొక్క పదవీ బాధ్యతలు చేపట్టాలని చెప్పారు. పదవీ బాధ్యతలు చేపట్టిన అంశంపై ఎంపిడివోలు, ఎంపీవో లు నివేదికలు అందచేయాలని ఆదేశించారు. గురువారం సాయంత్రం 5 గంటలకు గ్రామ పంచాయతీల పాలక మండలి పదవి కాలపరిమితి ముగిసినందున ఫిబ్రవరి 2వ తేదీ నుండి గ్రామ పంచాయతిల పరిపాలన పర్యవేక్షణకు ప్రత్యేక అధికారులను నియమించినట్లు కలెక్టర్ పేర్కొన్నారు నియమితులైన ప్రత్యేక అధికారులు తక్షణమే పదవీ బాధ్యతలు చేపట్టాలని కలెక్టర్ స్పష్టం చేశారు

Leave A Reply

Your email address will not be published.

Breaking