ప్రజాబలం ప్రతినిధి మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా జూలై 20:
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని ప్రభుత్వ ఐటీఐ ని మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ గౌతమ్ సందర్శించారు.
శనివారం రోజున ఐ టి ఐ ని సందర్శించి ఐటిఐ లోని కోపా, డ్రాప్ట్స్ మెన్ సివిల్, ఎలక్ట్రిషియన్, ఎలక్ట్రానిక్స్, ఫిట్టర్, మెకానిక్ డీజిల్, మోటార్ మెకానిక్, టర్నర్ మరియు వెల్డర్ ట్రేడ్ ల్లో ట్రైనింగ్ మరియు ఐటిఐలో చేపట్టిన పలు స్కిల్ డెవలప్ మెంట్ కార్యక్రమాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా కలెక్టర్ కు పూర్వపు ప్రిన్సిపాల్ డి. శైలజ వివరించారు. వివిధ ట్రేడ్లలోని ట్రైనీలకు గల ప్రభుత్వ మరియు ప్రైవేటు రంగాల్లోని ఉపాధి అవకాశాల గురించి కలెక్టర్ కు వివరించారు. మేడ్చల్ జిల్లాలో అప్రెంటిస్ షిప్ కన్వీనర్ గా మేడ్చల్ ఐటిఐ వ్యవహరిస్తుందని ప్రతి సంవత్సరం 1800 మందికి పైగా ట్రైనీలు అప్రెంటిస్ షిప్ పూర్తి చేసుకుంటున్నారని కలెక్టర్ కు ప్రిన్సిపల్ తెలియజేశారు.. ప్రావీణ్య స్కిల్ డెవలప్ మెంట్ వారు నిర్వహించిన స్కిల్స్ కాంపిటేషన్లో రాష్ట్ర స్థాయి ప్రథమ బహుమతి సాధించిన ఐటిఐ విద్యార్థులను కలెక్టర్ ప్రశంసించారు. ఐటిఐ లో నూతనంగా ప్రారంభిస్తున్న సేవింగ్ టెక్నాలజీ (టైలరింగ్) మరియు పుడ్ టెక్నాలజీ ట్రేడ్ పట్ల కలెక్టర్ ఆసక్తి వ్యక్తం చేశారు. వాటి గురించి ప్రిన్సిపల్ వివరించారు. మహిళ సాధికారతకు మేడ్చల్ ఐటిఐ కృషిని కలెక్టర్ అభినందించారు. ఐటిఐ లోని ఫ్రూట్ మరియు వెజిటేబుల్ ప్రాసెసింగ్ యూనిట్ల గురించి అధికారులు కలెక్టర్ కు వివరించారు. ఔత్సాహిక మహిళలకు ఈ ఇంకుబేటర్ సమర్ధత ఇస్తుందని ప్రిన్సిపల్ కలెక్టర్ కువివరించారు.
ఈ కార్యక్రమంలో ఐటిఐ ప్రస్తుత ప్రిన్సిపాల్ హనుమా నాయక్ , పూర్వపు ప్రిన్సిపాల్ డి. శైలజ, మేడ్చల్ ఎమ్మార్వో శైలజ, ఎంప్లాయిమెంట్ అధికారి నిర్మల, ఐఐటి సిబ్బంది సంబంధిత అధికారులు పాల్గొన్నారు.