ఈరోజు కక్కిరేణి గ్రామంలో ఈ నెల 15 నుండి 20 వరకు నిర్వహిస్తున్నా అమ్మా మాట అంగన్వాడి బాట అనే కార్యక్రమంలో బాగంగా అంగన్వాడీ కేంద్రంలో మూడు నుంచి ఐదు సంవత్సరాల వయసు గల పిల్లల్లో మేధో వికాస అభివృద్ధి నైతిక అభివృద్ధి సామాజిక అభివృద్ధి వికసించే వీలుగా పిల్లల భవిష్యత్తు తీర్చిదిద్దే విధంగా బోధనా పద్ధతి రూపొందించామని అన్నారు.
ప్రైవేటు పాఠశాలకు దీటుగా అంగన్వాడీ కేంద్రంలో విద్య నేర్పించబడుతుందని తల్లులకు ఇంటింటికి వెళ్లి గృహ సందర్శన ద్వారా వారి తల్లిదండ్రులకు అవగాహన కల్పించి ర్యాలీ నిర్వహించడం జరిగిందని అన్నారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఉపేందర్ జీ , అమ్మ ఆదర్శ పాఠశాల చైర్మన్ చిల్ల ప్రేమలత మురళి కృష్ణ , అంగన్వాడీ టీచర్స్ ఉమాదేవి , సుధా , యశోద మల్లిక , ఉపాధ్యాయులు గణేష్ , గోపాల్ రెడ్డి , సామాజిక కార్యకర్త వేముల సైదులు , బడే సత్తయ్య , కృష్ణ , అనసూర్య , దనమ్మ , సుభద్ర తదితరులు పాల్గొన్నారు.
