మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ గౌతమ్
ప్రజాబలం ప్రతినిధి మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా జూలై 20:
ప్రభుత్వం అమలు చేస్తున్న గృహ జ్యోతి, మహాలక్ష్మి పథకాలను అర్హులైన ప్రతి కుటుంబానికి అందించాలని మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ గౌతమ్ అన్నారు.
శనివారం రోజున మేడ్చల్ జిల్లాలోని ఎంపీడీవో కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రజాపాల కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు.
నమోదైన దరఖాస్తులను పరిశీలించారు. ప్రజా పాలన లో ఎన్ని దరఖాస్తులు వచ్చాయని సంబంధిత అధికారులు అడిగి తెలుసుకున్నారు. వచ్చిన దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలన్నారు. ప్రజా పాలల్లో వచ్చిన దరఖాస్తులను ఆన్లైన్లో డేటా విభాగంలో ఎప్పుడు కప్పుడు ఎంట్రీ చేయాలన్నారు. ప్రజా పాలన లో దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులకు అందించిన గృహజ్యోతి,మహాలక్ష్మి (గ్యాస్) పథకం విజయవంతంగా కొనసాగించాలన్నారు. ప్రభుత్వ పథకాలు అర్హులైన లబ్ధిదారులు దరఖాస్తు చేసుకునే ప్రక్రియలో పొరపాట్లను సరి చేసుకునేందుకు ఈ ప్రజాపాలన సేవా కేంద్రం ఉపయోగపడుతుందన్నారు.
తదనంతరం మేడ్చల్ లోని జిల్లా పరిషత్ పాఠశాల (బాలికల )సందర్శించి అమ్మ ఆదర్శ పాఠశాల కింద చేపడుతున్న అభివృద్ధి పనులను పరిశీలించి పనులను వేగవంతంగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. పేరెంట్స్,ఉపాధ్యాయుల సమావేశంలో కలెక్టర్ పాల్గొని విద్యార్థుల తల్లిదండ్రులతో ముచ్చటించారు. విద్యార్థుల తల్లిదండ్రులను పాఠశాలలో మీ పిల్లలకు ఉపాధ్యాయులు చదువు ఎలా చెపుతున్నారని విద్యార్థుల తల్లిదండ్రులను అడిగి తెలుసుకున్నారు. నోట్ బుక్స్ టెక్స్ట్ బుక్స్ మీ పిల్లలకు అందినవా అని అడిగారు. మధ్యాహ్నం భోజనం నాణ్యతతో పిల్లలకు అందిస్తున్నారా అని విద్యార్థుల తల్లిదండ్రులను అడిగారు, విద్యార్థుల తల్లిదండ్రు లను ఏవైనా సమస్యలుంటే తన దృష్టికి తీసుకురావాలని అన్నారు. మీ పిల్లలను స్కూల్ నుండి ఇంటికి వచ్చిన తర్వాత బాధ్యత తీసుకొని పిల్లలను చదివించాలన్నారు. మీ పిల్లలు మంచిగా చదువుకుంటే మంచి భవిష్యత్తు ఉంటుందని పిల్లలకు తల్లిదండ్రులు తెలియజేయాలన్నారు.
ఈ కార్యక్రమంలో జెడ్పి సి ఇ ఓ దిలీప్ కుమార్, మేడ్చల్ ఎమ్మార్వో శైలజ, జిల్లా విద్యాధికారి విజయ కుమారి,ఎంపీడీవో వసంత లక్ష్మి సంబంధిత అధికారులు పాల్గొన్నారు.