రాజన్న సిరిసిల్ల జిల్లా, మార్చి – 22
(ప్రజాబలం ప్రతినిధి)
సిరిసిల్ల పట్టణంలోని పదవ తరగతి పరీక్షా కేంద్రాలను జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.కుసుమ రామయ్య జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, కృష్ణవేణి టాలెంట్ పాఠశాల, సిద్ధార్థ ఇంగ్లీష్ మీడియం పాఠశాలల్లోని పరీక్షా కేంద్రాల్లోని అన్ని గదులను సందర్శించి, పరీక్షలు జరుగుతున్న సరళిని పరిశీలించారు. ఎంత మంది హాజరు.. గైర్హాజరు అయ్యారు అనే వివరాలను కలెక్టర్ ఆరా తీశారు. ఎలక్ట్రానిక్ పరికరాలను పరీక్షా కేంద్రం లోపలికి అనుమతించవద్దని అన్నారు. క్షేత్ర స్థాయిలో ఏమైనా ఇబ్బందులు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని పేర్కొన్నారు.