రాజన్న సిరిసిల్ల జిల్లా, మార్చి-22:
(ప్రజాబలం ప్రతినిధి)
జిల్లాలో భారత రత్న అవార్డు గ్రహీతలు జగ్జీవన్ రామ్ జయంతి, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ వంటి మహనీయుల జయంతి వేడుకలు నిర్వహణకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ అన్నారు.శనివారం జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ సమీకృత జిల్లా కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో మహనీయుల జయంతి వేడుకలు నిర్వహణపై సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ, ప్రభుత్వ ఆదేశాలతో ఏప్రిల్ 5న బాబు జగ్జీవన్ రామ్ జయంతి, ఏప్రిల్ 14న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలను ఎస్సీ అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో కట్టుదిట్టంగా నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లను అధికారులు ప్రణాళికాబద్ధంగా పూర్తి చేయాలని అన్నారు.జిల్లా కేంద్రంలో మహనీయుల జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరుగుతుందని అన్నారు. జయంతి వేడుకలకు అన్ని వర్గాల ప్రజలను ఆహ్వానించాలని కలెక్టర్ తెలిపారు. ప్రభుత్వం నుంచి వేడుకలకు సంపూర్ణ ఏర్పాట్లు చేస్తామని అన్నారు. గ్రామ పంచాయతీ నిధుల నుంచి గ్రామాలలో ఉన్న అంబేద్కర్ విగ్రహాల వద్ద అలంకరణ, పూల మాల వేయడం వంటి పనులు చేయాలని కలెక్టర్ సూచించారు.వేములవాడ లో కాంస్య అంబేద్కర్ విగ్రహ ఏర్పాటు కోసం 16 లక్షల నిధులు మంజూరు చేసి టెండర్లు పిలిచామని కలెక్టర్ తెలిపారు. అంబేద్కర్ జయంతి, జగ్జీవన్ రామ్ జయంతి వేడుకల కార్యక్రమాల వివరాలతో కూడిన పోస్టర్లు తయారు చేయాలని కలెక్టర్ అన్నారు.
అంబేద్కర్ జయంతి, జగ్జీవన్ రామ్ జయంతి వేడుకల సందర్భంగా సాధారణ ప్రజల రవాణా కు ఎటువంటి ఇబ్బందులు కాకుండా రోడ్ బ్లాక్ జరగాలని, ప్రజలకు వాహనదారులకు ప్రత్యామ్నాయ మార్గాలు చూపాలని కలెక్టర్ తెలిపారు.ఈ సమావేశంలో డిఎస్పి చంద్రశేఖర్ రెడ్డి ఇన్చార్జి ఎస్సీ వెల్ఫేర్ అధికారి రాజా మనోహర్ ఈడిఎస్సీ కార్పొరేషన్ స్వప్న ఏ ఎస్. డబ్ల్యూ ఓ, విజయలక్ష్మీ , వివిధ ఎస్సీ ఎస్టీ కుల సంఘాల నాయకులు సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.