వేములవాడ మార్చి -24 (ప్రజా బలం న్యూస్)
వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి ఆదివారం రోజున భక్తులు పోటెత్తారు. మన రాష్ట్రం నుండే కాకుండా ఇతర రాష్ట్రాల నుండి అధిక సంఖ్యలో రాజరాజేశ్వర స్వామిని దర్శించుకోవడానికి వేములవాడకు భక్తులు తరలివచ్చారు. దక్షిణ కాశీగా పేరుగాంచిన రాజన్న ఆలయంలో భక్తులు ఉదయాన్నే లేచి ధర్మగుండంలో స్నానం ఆచరించి, తలనీలాలు సమర్పించుకొని స్వామివారికి ఇష్టమైన కోడెమొక్కును చెల్లించుకొని గంటల తరబడి క్యూ లైన్ లో నిలబడి దర్శించు కున్నారు.