లక్షెట్టిపేట 4 వార్డ్ లో డ్రైనేజీ సమస్య

 

దుర్వాసనతో కాలనీ ప్రజలు

తొంగి చూడని అధికారులు

ప్రజాబలం మంచిర్యాల నియోజకవర్గం రిపోర్టర్ మార్చి 24 : లక్షెట్టిపేట పట్టణంలోని నాలుగో వార్డు మహాలక్ష్మి వాడలో డ్రైనేజీ వ్యవస్థ అధ్వానంగా మారింది.మురికి కాలువల నిర్వహణ సక్రమంగా లేకపోవడంతో కాలనీ వాసులకు జ్వరాలు వస్తున్నాయి.నాలుగో వార్డ్ లో కొన్ని సంవత్సరాలుగా పూడిక తీయకపోవడం వలన మురుగు నీటి ప్రవాహం ఎక్కడిక్కడే నిలిచి పోయింది.మురికి కాల్వ నుండి ఇళ్లల్లోకి,రోడ్లపైకి, తాగే బావిలో కూడా మురుగునీటి ప్రవాహం వస్తున్నాయి.దోమలకు ఆవసంగా మారింది. మున్సిపల్ అధికారులు పట్టించుకోవడం లేదని కాలనీ ప్రజలు ఆరోపిస్తున్నారు.
డ్రైనేజీ క్లీన్ చేయండి.
బొంగోని రవి గౌడ్
డ్రైనేజ్ వ్యవస్థ అద్వానంగా మారింది. నాలుగో వార్డులో
గత కొన్ని సంవత్సరాల నుండి పూడిక తీయడం లేదు.ఇబ్బంది పడాల్సి వస్తుందన్నారు. పిల్లలు జ్వరాలు బారిన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
అధికారులు సమస్య పరిష్కరించాలి.
దండే వేణి గంగమ్మ
కాలనీ వాసి లక్షెట్టిపేట:
పిల్లలకు జ్వరాలు వస్తున్నాయి. వాసనతో భరించలేకపోతున్నాం. కాలనీ వదిలి వెళ్లి పోయే పరిస్థితి దాపురించింది. అధికారులు స్పందించాలి.

Leave A Reply

Your email address will not be published.

Breaking