ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల విద్యా ప్రమాణాల పెంపుకు ప్రణాళికబద్ధంగా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్

 

ఖమ్మం ప్రతినిధి ఆగస్టు 6 (ప్రజాబలం) ఖమ్మం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల విద్యా ప్రమాణాల పెంపుకు ప్రణాళికబద్ధంగా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు. మంగళవారం కలెక్టర్, కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో విద్యా శాఖ అధికారులతో విద్యార్థుల విద్యా ప్రమాణాల పెంపుకై చర్యలపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, పాఠశాలల్లో విద్యార్థుల, ఉపాధ్యాయుల హాజరుపై దృష్టి పెట్టాలన్నారు. విద్యార్థులను 80 శాతం పైన హాజరు వాళ్లను, 50 నుండి 80 శాతం మధ్య హాజరు, 50 శాతం లోపల హాజరు విద్యార్థులను మూడు విభాగాలుగా గుర్తించి, 50 నుండి 80 శాతం మధ్య హాజరు విద్యార్థులపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. విద్యార్థుల సమస్యలు తెలుసుకొని, వారి తల్లిదండ్రులకు అవగాహన కల్పించి, క్రమం తప్పకుండా పాఠశాలకు హాజరయ్యేలా చూడాలన్నారు. ఉపాధ్యాయుల హాజరును ప్రతిరోజూ పర్యవేక్షణ చేయాలన్నారు. ప్రభుత్వం నిర్దేశించిన షెడ్యూల్ ప్రకారం పాఠశాలల్లోని విద్యార్థులకు బేస్ లైన్ పరీక్ష నిర్వహించాలని, వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ వారి కనీస విద్యా ప్రమాణాలు పెంపొందించేందుకు చర్యలు తీసుకోవాలని ఆయన తెలిపారు. ఉపాధ్యాయులు బోధనపై దృష్టి పెట్టాలని, టిఎల్ఎం ల రూపకల్పన చేయాలన్నారు. ప్రతి సబ్జెక్ట్ పై, అంశంపై బెస్ట్ టిఎల్ఎం లను రూపొందించి పాఠశాలలకు అందజేయాలన్నారు ఇంటివద్ద తల్లిదండ్రులు, తమ పిల్లల చదువుపై దృష్టి పెట్టేలా అవగాహన కల్పించాలన్నారు. పేరెంట్, టీచర్ మీటింగ్ లు బాధ్యతగా నిర్వహించాలన్నారు. పిటిఎం లలో తల్లిదండ్రుల ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాలన్నారు. తల్లిదండ్రులతో వారి పిల్లల చదువుపై చర్చించాలన్నారు. డెమో తరగతులు నిర్వహించి, తల్లిదండ్రులకు చూపాలన్నారు. తరగతులు, పాఠశాల వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేయాలన్నారు. తల్లిదండ్రులు, పిల్లలతో కలిసి క్రీడాపోటీలు నిర్వహించాలన్నారు గ్రామ, మండల, జిల్లా స్థాయి క్రీడా పోటీలకు ప్రణాళిక చేయాలన్నారు. పాఠశాలల్లో స్థలం ఉన్నవాటిని గుర్తించి న్యూట్రీ గార్డెన్ల పెంపకానికి చర్యలు తీసుకోవాలన్నారు. గార్డెన్ నిర్వహణ పిల్లలు, ఉపాధ్యాయులు చేపట్టాలన్నారు. వచ్చే వారంలోగా ప్రతి మండలంలో కనీసం 15 పాఠశాలల్లో న్యూట్రీ గార్డెన్ల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని అన్నారు. పాఠ్యాంశాలు విద్యార్థులకు సులభంగా అర్థమయ్యే విధంగా మెరుగైన బోధనా పద్ధతులను ఉపాధ్యాయులు అనుసరించే విధంగా చూడాలన్నారు. పిల్లల్లో విద్యా ప్రమాణాలు పెంచాలని, పిల్లలు చక్కగా ఎదిగి ప్రయోజకులైతే, ఆయా పాఠశాలలకు, ఉపాధ్యాయులకు గర్వంగా ఉంటుందని కలెక్టర్ అన్నారు ఈ సమావేశంలో జిల్లా విద్యాశాఖ అధికారి సోమశేఖరశర్మ, ఆర్ఎంఓ రాజశేఖర్, ఏఎంఓ రవికుమార్, ప్లానింగ్ కోఆర్డినేటర్ సిహెచ్. రామకృష్ణ, మండల విద్యా శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.

Breaking