తెలంగాణ జాతిపితగా ప్రో”జయశంకర్ సార్ ను ప్రకటించాలి

 

ఉమ్మడి ఖమ్మం జిల్లా తెలంగాణ ఉద్యమకారుల ఫోరమ్ రాష్ట్ర స్టీరింగ్ కమిటీ చైర్మన్ డాక్టర్ కె.వి కృష్ణారావు

ఖమ్మం ప్రతినిధి ఆగస్టు 6 (ప్రజాబలం)
ఖమ్మం నగరంలో మయూరి సెంటర్ అమరవీరుల స్తూపం వద్ద ఉమ్మడి ఖమ్మం జిల్లా తెలంగాణ ఉద్యమకారుల ఫారం ఆధ్వర్యంలో ప్రొఫెసర్ జయశంకర్ , ప్రజా గాయకుడు గద్దర్ , ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ జహీర్ అలీ , తెలంగాణ చిన్నమ్మగా పేరుందిన సుష్మ స్వరాజ్ చిత్రపటాలకు పూలమాలు వేసి ఘనంగా నివాళులర్పించారు . వీరు ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు లో ఎంతో సహకరించారని వీరి త్యాగ ఫలితమే తెలంగాణ ఏర్పడిందని అలాగే వారు చేసిన త్యాగాలను గుర్తు చేసుకున్నారు . ఇలాంటి మహనీయులను మనం కోల్పోవడం చాలా బాధాకరమని ఒక నిమిషం మౌనం పాటించారు . ఇంకా వారు జీవించి ఉంటే మరెన్నో ఉద్యమాలకు నాంది పలికి మరెన్నో సాధించేవారమని పేర్కొన్నారు . ఈ కార్యక్రమంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా తెలంగాణ ఉద్యమకారుల ఫోరమ్ రాష్ట్ర స్టీరింగ్ కమిటీ చైర్మన్ డాక్టర్ కె.వి కృష్ణారావు , డోకూపర్తి సుబ్బారావు , పగడాల నరేందర్ , కొప్పెర జానకి రాములు , బచ్చల పద్మచారి , అడప ప్రవీణ్ కుమార్ , గజ్జి సుధాకర్ , లింగన బోయిన సతీష్ , బత్తిని మధు గౌడ్ , పమ్మి రవి , చెరుకుపల్లి నాగేశ్వరావు , పెల్లూరి విజయకుమార్ , బాసాటి హనుమంతరావు , బెల్లంకొండ నాగేశ్వరావు , దరిపల్లి వీరబాబు , దొడ్డ శ్రీనివాస్ రెడ్డి , తీగల రాము , రెడ్డి బోయిన వరలక్ష్మి , రచ్చ రామారావు , కామని అనంతలక్ష్మి , స్వరూప , ధనలక్ష్మి , కృష్ణవేణి , పద్మ , జయమ్మ తదితరులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.

Breaking