బివికె లైబ్రరీకి సుంకర ప్రసాద్‌ బుక్స్‌ వితరణ

 

ఖమ్మం ప్రతినిధి ఆగస్ట్ 6 (ప్రజాబలం) ఖమ్మం బోడేపూడి విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో నడుస్తున్న గ్రంథాలయానికి ఖమ్మం నగరంలోని బ్యాంకు కాలనీ నివాసి, అభ్యుదయవాది, వామపక్ష శ్రేయోభిలాషి సుంకర ప్రసాద్‌ (జాడీల ప్రసాద్‌) బుక్స్‌ వితరణ చేశారు. మంగళవారం ప్రసాద్‌ కుమారుడు సుంకర పుష్కర ప్రసాద్‌ గ్రంథాలయానికి వచ్చి సిపిఎం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు, గ్రంథాలయం ఇన్‌ఛార్జ్‌ ఎస్‌.కె.అఫ్జల్‌లకు బుక్స్‌ అందజేశారు. ఈ సందర్భంగా నున్నా నాగేశ్వరరావు మాట్లాడుతూ జాడీల ప్రసాద్‌ మొదటి నుండి వామపక్షవాది అని, అభ్యుదయ ఆలోచన కలిగిన వ్యక్తి అని వారు అధ్యయనం చేసిన విలువైన బుక్స్‌ సాహిత్యాన్ని బివికె లైబ్రరీకి అందజేయడం అభినందనీయమని అన్నారు. వీరు డొనేట్‌ చేసిన బుక్స్‌, సాహిత్యం రాబోయే తరాలకు ఉపయోగపడుతుందని తెలిపారు. బుక్స్‌ అందజేసిన ప్రసాద్‌ గారికి వారి కుటుంబానికి గ్రంథాలయం తరఫున మరియు బివికె తరఫున ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నట్లు ఒక ప్రకటనలో తెలియజేశారు ఈ కార్యక్రమంలో బివికె మేనేజర్‌ వై.శ్రీనివాసరావు లైబ్రరీ ఇన్‌ఛార్జ్‌ ఎస్‌.కె.అఫ్జల్‌, సిపిఎం పార్టీ రాష్ట్ర నాయకులు ఎం.సుబ్బారావు జిల్లా ఆఫీసు కార్యదర్శి ఆర్‌.ప్రకాష్‌, గోపి తదితరులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.

Breaking