నిర్మల్ జిల్లా కలెక్టర్ అధికారులతో మాట్లాడుతూ ప్రజావాణి లో వచ్చిన దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలి
ప్రజా బలం ప్రతినిధి నిర్మల్ జిల్లా..సోమవారం నిర్మల్ జిల్లా సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా పాలనాధికారి ఆశిష్ సాంగ్వాన్ అదనపు కలెక్టర్ లు ఫైజాన్ అహ్మద్, కిషోర్ కుమార్ లతో కలసి అర్జిదారుల నుండి అర్జీలను స్వీకరించారు.
ఈ సందర్భంగా వివిధ మండలాల నుండి అర్జీదారుల నుండి 45 దరఖాస్తులు వచ్చాయని, సంబంధిత అధికారులు త్వరితగతిన అర్జిదారుని సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు.
జిల్లా కలెక్టర్ అధికారులతో మాట్లాడుతూ ప్రజావాణి లో వచ్చిన దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని, పెండింగ్ లేకుండా చూడాలని, ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమం లో రోజువారి టైమ్ టేబుల్ ప్రకారం నిర్వహించాలని, వేసవిలో ప్రజలకు ఇబ్బంది కలగకుండా మిషన్ భగీరథ నీటి సరఫరా సక్రమంగా నిర్వహించాలని అన్నారు.సరఫరాలో ఏమైనా సమస్యలు తలెత్తితే ఎప్పటికప్పుడు పరిష్కరించుకొని నీటి సరఫరాను చేయాలన్నారు.
ప్రజావాణి లో వివిధ శాఖల జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు