సర్దార్ పటేల్ స్టేడియంలో చేపడుతున్న టెన్నిస్ కోర్టుల మిగులు పనులు వారంలోగా పూర్తిచేసి, క్రీడాకారులకు అందుబాటులో తేవాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ ఆదేశం

 

ఖమ్మం ప్రతినిధి ఫిబ్రవరి 27 (ప్రజాబలం) ఖమ్మం సోమవారం కలెక్టర్ సర్దార్ పటేల్ స్టేడియంలో నిర్మిస్తున్న నూతన టెన్నిస్ కోర్టుల పనుల పురోగతిని క్షేత్ర స్థాయిలో తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రూ. 93 లక్షల వ్యయంతో చేపట్టిన పనుల్లో 3 సింథటిక్ టెన్నిస్ కోర్టుల ఏర్పాటు పనులు పూర్తయినట్లు, గ్యాలరీ, ఇతర సౌకర్యాలకల్పన పనులు ప్రగతిలో ఉన్నట్లు తెలిపారు. అంతర్జాతీయ ప్రమాణాలతో టెన్నిస్ కోర్టుల నిర్మాణం చేసినట్లు ఆయన అన్నారు. క్రీడాకారులు ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయాలను సద్వినియోగం చేసుకొని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని కలెక్టర్ తెలిపారు.

కలెక్టర్ తనిఖీ సందర్భంగా జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి పరంధామ రెడ్డి పీఆర్ ఇఇ కెవికె. శ్రీనివాస్ అధికారులు తదితరులు ఉన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking