ఓటర్ నమోదుకు ప్రోత్సహించాలని అర్హత గల ప్రతి ఒక్కరూ ఓటు హక్కు పొందేలా అవగాహన కల్పించాలి జిల్లా కలెక్టర్ వి పి గౌతమ్

 

ఖమ్మం ప్రతినిధి సెప్టెంబర్ 6 (ప్రజాబలం) ఖమ్మం ఓటర్ నమోదుపై యువతకు ప్రేరణ కల్పించేలా పోస్టర్లు, వీడియోల రూపకల్పనకు ఆసక్తిగల వారి నుండి ఎంట్రీలను రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ఆహ్వానిస్తున్నారని కలెక్టర్ తెలిపారు. పోస్టర్లు, వీడియోలు ప్రజలను ఓటర్ లిస్ట్ ను తనిఖీ చేసేవిధంగా ప్రోత్సహించాలని, టార్గెట్ యువతకు సులభ రీతిలో అర్థమయ్యేలా ఉండాలని, తెలుగు/హిందీ/ఆంగ్ల/ఉర్దూ భాషల్లో రూపొందించ వచ్చని ఆయన తెలిపారు. జెపేగ్/పిఎన్ జి ఫార్మాట్ లో 5 ఎంబి కి దాటకూడదని, వీడియో నిడివి 60 సెకన్లు దాటకూడదని ఆయన అన్నారు. ఎంట్రీల్లో రాజకీయ అర్థాలు వచ్చే గుర్తులు, రంగులు, నాయకులు తదితరాలు ఉంటే తిరస్కరణకు గురవుతాయని ఆయన తెలిపారు. ఉత్తమ ఎంట్రీ విజేతలకు రూ. 20 వేల నగదు బహుమతి ఇస్తారని ఆయన అన్నారు ఎంట్రీలు https:// tinyurl.com/electioncrea-than2023 కి ఈ నెల 16 లోగా అందాలని జిల్లా కలెక్టర్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking