కబ్జాకు గురైన ప్రభుత్వ భూమిని కాపాడాలని జిల్లా కలెక్టర్ ఫిర్యాదు…

 

జమ్మికుంట ప్రజా బలం ప్రతినిధి మే 27,

జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలోని ధర్మారంలోని సర్వే నెం. 368 కుంట శిఖం భూమి 0-33 గుంటలు కబ్జాదారుల బారి నుండి కాపాడాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతికి జమ్మికుంట మున్సిపాలిటీ 1వ వార్డు కౌన్సిలర్ బొంగోని వీరన్న ఫిర్యాదు చేశారు. సర్వే నెం 368 లో 0-33 గుంటల కుంట సిఖం భుమి ఉండగా మధ్యలో నుండి 1965లో ఆర్&బి రోడ్డు జమ్మికుంట నుండి వావిలాల వరకు పోయినది.అప్పటి నుండి అట్టి కుంటలో నీరు నిల్వలేదు. అప్పటినుండి కుంట ఖాళీగా ఉండేది.ఈ ప్రభుత్వ శిఖం భూమి రోడ్డుకు రెండు ప్రక్కలు ఉండగా మేన్ రోడ్డు భూమి అయినది.ఇట్టి భూమిని ఆనుకొని ఉన్న భూమిలో అనాధికారంగా లే అవుట్ లు లేకుండా ఇండ్ల ప్లాట్స్ భూమి గజం రూ 20 వేల చోప్పున గుంటకు రూ 24 లక్షలకు అమ్ముతున్నారు. ఇట్టి భూములు అమ్మినవారి ప్రక్కనే ఉన్నా 0-33 గుంటల శిఖం భూమిపై కన్నుపడి ఎవరికి వారి చదును చేసుకుంటు భూమి హద్దులు చేరిపివేస్తు అట్టి ప్రభుత్వ భూమిని కొందరు వ్యక్తులు అక్రమించుకున్నారు. ఈనెల 25వ తేదీన టిప్పర్లతో మొరo పోసి భూమిని చదును చేసినారు.ఈ ప్రభుత్వ శిఖం భూమికి బహిరంగ మార్కెట్లో రూ 8 కోట్ల రూపాయలు వరకు ఉంటుందని పేర్కొన్నారు. ఇట్టి ప్రభుత్వ భూమిలో మొరం పోసేటప్పుడు జమ్మికుంట తాసిల్దార్ కు సమాచారం ఇచ్చిన పట్టించుకోలేదని పేర్కొన్నారు. ఆర్ అండ్ బి రోడ్డుకు ఇరు ప్రక్కన ఉన్న (ప్రభుత్వ భూమి) 0-33 గుంటలకు హద్దులు పెట్టి ఆక్రమణకు గురికాకుండా కాపాడాలని ఆయన కలెక్టర్ కు విజ్ఞప్తి చేశారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking