భద్రత ఏర్పాట్లను పరిశీలించిన రాచకొండ సిపి ,మేడ్చల్ జిల్లా కలెక్టర్

 

లోక్ సభ ఎన్నికలు చివరి దశకు చేరుకున్న నేపథ్యంలో రాచకొండ కమిషనర్ డా. తరుణ్ జోషి మేడ్చల్ కలెక్టర్ గౌతమ్ పొట్రు తో కలిసి సోమవారం రాచకొండ పరిధిలోని ఘట్ కేసర్ హోలీ మేరీ కళాశాలలో ఏర్పాటు చేసిన ఎన్నికల కౌంటింగ్ కేంద్రాన్ని సందర్శించారు. త్వరలో జరగనున్న ఓట్ల లెక్కింపు ప్రక్రియ కోసం చేపట్టవలసిన భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియ సమయంలో అప్రమత్తంగా ఉండాలని ఏ చిన్న సమస్య రాకుండా చూసుకోవాలని సిబ్బందికి సూచించారు. అక్కడున్న పోలీస్ సిబ్బందికి, సెంట్రల్ బలగాలకు పలు భద్రతా పరమైన సూచనలు చేశారు. డీసీపీ మల్కాజిగిరి పద్మజ, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking