ఎన్నికల కోడ్ అమలు లో ఉన్నందున జిల్లా లో లైసెన్స్ పొందిన ఎటువంటి ఆయుధాలు తీసుకెళ్లడం నిషేధించబడింది అని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్
ప్రజాబలం ప్రతినిధి నిర్మల్ జిల్లా..ఎన్నికల కోడ్ అమలు లో ఉన్నందున జిల్లా లో లైసెన్స్ పొందిన ఎటువంటి ఆయుధాలు తీసుకెళ్లడం నిషేధించబడింది అని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ఒక ప్రకటన లో పేర్కొన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం లోక్ సభ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన నేపథ్యంలో జిల్లాలో ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులోకి వచ్చిందని, లైసెన్స్ కలిగిన ఆయుధాలు, ఇతర కత్తుల వంటి ఆయుధాలు సెక్షన్ 144 క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ప్రకారం కలిగి ఉండరాదని తెలిపారు. లైసెన్స్ కలిగిన గన్స్ వంటి ఆయుధాలను సమీప పోలీస్ స్టేషన్లో సమర్పించాలని, దీనికి సంబంధించి జిల్లా ఎస్పీ సంబంధిత పోలీస్ అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగిందని ఆ ప్రకటనలో కలెక్టర్ పేర్కొన్నారు.